రాష్ట్రీయం

అఖిలపక్షంతో చర్చించకుండా చట్టాల్లో మార్పులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణలో రెవిన్యూ, మున్సిపల్ చట్టాలను మార్చుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రకటనకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది ఏకపక్ష నిర్ణయంగా విమర్శించారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించకుండా చట్టాలను మార్చుతామని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు.
చట్టాల రూపకల్పనలో కనీసం ప్రజలనైనా భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ప్రతిపక్ష శాసన సభ్యులను ప్రలోభాలకు గురిచేసి అధికార పార్టీలో చేర్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్న గుణాత్మక మార్పులంటే ఫిరాయింపులను ప్రోత్సహించడమేనని ఆయన ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకోసం టీడీపీ దేబిరిస్తోందని టీఆర్‌ఎస్ నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. గతంలో టీఆర్‌ఎస్ తమతో కలవడం దేబిరించడమేనా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీ చౌకబారు ప్రకటనలు చేస్తోందని విరుచుకుపడ్డారు.