రాష్ట్రీయం

అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న కోటి అనే వ్యక్తిని అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ మహిళా నేత లక్ష్మీపార్వతి డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం డీజీపీని కలసిన తర్వాత లక్ష్మీపార్వతి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరప్రదమైన స్థాయిలో ఉన్న తనను అగౌరపరుస్తూ విమర్శలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఏప్రిల్ 4వ తేదీన కోటి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపర్చాడని ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా కోటితో ప్రసారం చేసిన మీడియా చానల్ యాంకర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన కోటిని తన బిడ్డగానే భావించానని, అయితే దీని వెనుక కుట్రను ఛేదించాలన్నారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని ఆమె డీజీపీకి విన్నవించారు.