రాష్ట్రీయం

జూన్ 1న ఐసీఏఆర్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ వర్శిటీలు, వెటర్నరీ యూనివర్శిటీలు, హార్టికల్చర్ యూనివర్శిటీలు, ఫిషరీస్ యూనివర్శిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో అడ్మిషన్లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రవేశపరీక్ష బాధ్యతను తీసుకుని ఈ ఏడాది ఐసీఏఆర్-యూజీ, ఐసీఏఆర్ -పీజీ, ఐసీఏఆర్ పీహెచ్‌డీ పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 75 వ్యవసాయవర్శిటీలున్నాయి. అందులో ప్రభుత్వ ఆధీనంలోనే 64 వర్శిటీలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు నాలుగు ఐసీఏఆర్ డీయూలు, మూడు సెంట్రల్ ఎగ్రికల్చర్ యూనివర్శిటీలు, నాలుగు కేంద్రీయ వర్శిటీలలో ఉన్న వివిధ కోర్సులకు ప్రతి ఏటా 15వేల యూజీ సీట్లు, 11వేల పీజీ సీట్లు, 2500 పీహెచ్‌డీ సీట్లను ఈ ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. దరఖాస్తులను ఏప్రిల్ 30 వరకూ ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఫీజు చెల్లించేందుకు ఆఖరు తేదీ మే 1, కాగా ఆన్‌లైన్ పరీక్ష జూన్ 1న జరుగుతుంది.
లాసెట్ దరఖాస్తు గడువు 25 వరకు పెంపు
తెలంగాణ లాసెట్ దరఖాస్తు గడువు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదీ వరకూ పొడిగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీ బీ రెడ్డి చెప్పారు. అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు గడువు 15వ తేదీతో ముగిసిందని, అయితే అభ్యర్ధుల కోరిక మేరకు మే 16వ తేదీ వరకూ అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.