రాష్ట్రీయం

32 జడ్పీలనూ కైవసం చేసుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లా పరిషత్‌ల్లో అన్నింటినీ తెలంగాణ రాష్ట్ర సమితియే కైవసం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రజాప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకొని పరిషత్ ఎన్నికలను ప్రతిష్ఠాకరంగా తీసుకోవాలన్నారు. రెండు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను మాజీ ఎమ్మెల్యేలకు కేటాయించారు. పెద్దపల్లికి పుట్ట మధును, ఆసిఫాబాద్‌కు కోవా లక్ష్మిని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, శాసన సభ, సర్పంచ్, లోక్‌సభకు వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం గట్టారని, అదే ఒరవడి జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతం కావాలని సూచించారు. వరుసగా వచ్చిన మూడు ఎన్నికల్లోనూ తిరుగులేని మెజారిటీ సాధించి టీఆర్‌ఎస్ హాట్రిక్ సాధించిందని, పరిషత్ ఎన్నికల్లోను అదే మాదిరి ఫలితాలు రావడానికి పార్టీ శ్రేణులు, నేతలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలను ఎంపిక చేసే బాధ్యతను సంబంధిత ఎమ్మెల్యేలకే అప్పగిస్నుట్టు కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు రెండేసి జిల్లాలకో మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థులను సమన్వయకర్తలుగా నియమిస్తోన్నట్టు కేసీఆర్ ప్రకటించారు. పార్టీలోకి వచ్చే కొత్తగా వస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధుల వల్ల తమకు అవకాశాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కొత్త, పాత అందరి సహకారం కావాలని, అవకాశాలు, పదవులు కూడా అందరికీ వస్తాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం ఉన్న చోట జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం కల్పిస్తామన్నారు. అందుకే, మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన పుట్ట మధుకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా, అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఓడిపోయిన కోవా లక్ష్మికి ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఎంపిక చేశామని కేసీఆర్ వివరించారు. త్వరలోనే ఇతర జిల్లా పరిషత్‌లకు కూడా అభ్యర్థులను ముందుగానే ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు 535 జడ్పీటీసీలను, 5,857 ఎంపీటీసీలను టీఆర్‌ఎస్తే గెలుచుకోవాలని, తద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు అభివృద్ధి ఫలాలు, పార్టీ బలోపేతానికి దోహదం చేయనుందని పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిష్ఠాకరంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.