రాష్ట్రీయం

త్వరలో స్మార్ట్‌మీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 15: విద్యుత్ వినియోగదార్లందరికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ (సీఎండీ) కె రాజబాపయ్య చెప్పారు. ఈ స్మార్ట్‌మీటర్లలో పోస్ట్‌పెయిడ్, ప్రీ పెయిడ్ అనే రెండు రకాలు ఉంటాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా స్ధాయి అధికారులతో సమీక్ష నిమిత్తం సోమవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. స్మార్ట్‌మీటర్లు ద్వారా విద్యుత్ వినియోగించి, బిల్లులు చెల్లించకపోతే నేరుగా తమ కార్యాలయం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడం, చెల్లింపులు జరిగిన తర్వాత తిరిగి యధాస్థితిని కొనసాగించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నామన్నారు. వెయ్యి మీటర్లకు 800 స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామని సీఎండీ తెలిపారు. ఇది విజయవంతం అయితే ఈపీడీసీఎల్ పరిధిలో సుమారు 6 లక్షల కనెక్షన్లు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు. ఈ పైలట్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్‌ఎల్) నిర్వహిస్తోందన్నారు. స్మార్ట్ మీటర్లలో కేవీఏ, కేవీఏహెచ్, కేడబ్ల్యూహెచ్ అనే మూడు రకాలుగా విభజించామన్నారు. వినియోగదారుని మీటరు ద్వారా ఎంత విద్యుత్ వినియోగం జరిగింది, ఆ మీటరుకు ఎంత లోడు ఇస్తున్నాము ఇంకా ఎంత విద్యుత్ అవసరం తదితర వివరాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ స్మార్ట్‌మీటర్లను సంస్థ ఏర్పాటుచేస్తుందని, వినియోగదారుడే మీటరు తెచ్చుకుంటే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య జరిగే విద్యుత్ వినియోగంలో యూనిట్‌కు రూ.1 రిబేటు ఇస్తామని సీఎండి వివరించారు. ఈ రిబేటు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. మహారాష్టల్రో మాదిరిగా మహావితరన్ అనే సాఫ్ట్‌వేర్‌ను తీసుకువచ్చామన్నారు. దీనిద్వారా విద్యుత్ మీటరు నుంచి రీడింగ్ తీసిన వెంటనే సెల్‌ఫోన్లకు సమాచారం వెళ్తుందని, నిర్ణీత కాలంలో బిల్లు చెల్లింపులు జరగకపోతే సమాచారం ఇవ్వడం, చెల్లించిన మొత్తానికి చెల్లించినట్టు సమాచారాన్ని సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపిస్తామని సీఎండి రాజబాపయ్య వివరించారు. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.1000 కోట్లతో ఇన్‌డోర్, అవుట్‌డోర్, సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది డిమాండ్ మరింత పెరుగుతోందని, నష్టాలను నివారించడానికి లోడ్‌ఫీడర్లను గుర్తించామని, మూడుమాసాల్లో ఈ నష్టాలను అధిగమించాలని పట్టణాల్లో 8శాతం నుంచి 3 శాతానికి, గ్రామాల్లో 8 శాతం నుంచి 4 శాతానికి నష్టాలను తగ్గించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించామని సీఎండీ రాజబాపయ్య వివరించారు.

చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న ఎపీఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపయ్య