రాష్ట్రీయం

విజయం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమైందని సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. వెయ్యి శాతం విజయం తమదేనని స్పష్టంచేశారు. ఓటర్లను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీ చేసిన కుట్రలన్నీ పటాపంచలయ్యాయని విమర్శించారు. సోమవారం ఉండవల్లిలో తన నివాసం నుంచి బూత్‌కమిటీ కన్వీనర్లు, సేవామిత్ర, పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ముప్పేట దాడులతో టీడీపీని ప్రజలకు దూరం చేయాలని చేసిన పన్నాగాలు, వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ఎప్పటికప్పుడు ప్రతిఘటించ గలిగామన్నారు. ఒక్క కలం పోటుతో తెలంగాణలో 25 లక్షల ఓట్లను తొలగించారని ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించేందుకు కుట్ర జరిగిందన్నారు. ఐపీ అడ్రస్‌లు ఇవ్వకుండా ఓట్ల దొంగల్ని ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని ధ్వజమెత్తారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పోలింగ్‌రోజు ఉదయానే్న ఈవీఎంలు మొరాయించేలా చేశారని, మిషన్ పనిచేయకపోతే కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే శాంతి భద్రతల సమస్యను సృష్టించారని దుయ్యబట్టారు. భాస్కర్‌రెడ్డి హత్య, స్పీకర్‌పై దాడి, మహిళా అభ్యర్థుల పట్ల దౌర్జన్యాలకు దిగి ప్రజాతీర్పును కాలరాసేందుకు కుతంత్రాలు పన్నారని ఆరోపించారు. ప్రజల్ని పోలింగ్‌కు రానివ్వకుండా భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఏపీలో టీడీపీ గెలుపును అడ్డుకునేందుకు సకలశక్తులూ ఒడ్డారని, అయినా విజ్ఞత కలిగిన జనంతో పాటు ప్రపంచం మొత్తం కదిలొచ్చి దుష్టశక్తుల ఆగడాలను తిప్పికొట్టాయన్నారు. చివరిదశలో మీడియాలో పిలుపివ్వడం ప్రజలను కదిలించిందని చెప్పారు. వెనక్కు వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారని ప్రజలంతా ఏకోన్ముఖంగా టీడీపీకి అండగా నిలిచారన్నారు. ప్రజస్వామ్యానికి ఓటర్లు స్ఫూర్తిగా నిలిచారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మొక్కవోని దీక్షతో దృఢ సంకల్పంతో జనం కదిలారన్నారు. ఈవీఎంలను దేశంలోని అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయని ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక్క క్షమాపణతో ఎన్నికల సంఘం సరిపెట్టటం దుర్మార్గమన్నారు. వీవీప్యాట్‌లపై పోరాడింది తమ పార్టీయే అన్నారు. వీటిపై రూ. 9వేల కోట్లు ఖర్చు పెట్టారని ప్రజల్లో నమ్మకం కలిగించేందుకే 23 పార్టీలు ఉద్యమించాయన్నారు. 50 శాతం వీవీ ప్యాట్ రశీదులు లెక్కించటానికి అభ్యంతరం ఎందుకని నిలదీశారు. కౌంటింగ్ వారంరోజులు ఆలస్యమవుతుందనేది కట్టుకథలని కొట్టిపారేశారు. తెలంగాణలో పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో ఓట్లు ఎక్కువగా వచ్చాయని దీంతో వాటిపట్ల ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లిందన్నారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ రశీదులు సరితూగాలని, గతంలో బ్యాలెట్ విధానంలో పోలైన ఓట్లన్నీ సరిపోను ఉండేవని గుర్తుచేశారు. టెక్నాలజీతో ప్రజాస్వామ్యంలో పారదర్శకత పెరగాల్సింది పోయి అక్రమాలకు పాల్పడటం మంచి సంప్రదాయం కాదన్నారు. ఈవీఎంలతో ప్రజాస్వామ్య విశ్వసనీయత ప్రశ్నార్థకం కారాదన్నారు. దొంగల్ని పట్టుకునేందుకు టీడీపీ శ్రేణులు సమన్వయంతో ఎన్నికల్లో పని చేశారని ప్రశంసించారు. ఈవీఎంలపై టీడీపీ పోరాటం చేస్తే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. ప్రతి సర్వే తమకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించిందని తమ పార్టీకి 110 నుంచి 140 సీట్లు రావటం ఖాయమన్నారు. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటితమైనందునే గెలుపు ఏకపక్షం కానుందని తెలిపారు.