రాష్ట్రీయం

బరిలో త్రిముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. బరిలో ఎందరున్నా ప్రధానమైన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండబోతుంది. ఈ సారి ఎన్నికల బరిలో టీడీపీ లేకపోవడం విశేషం కాగా పార్టీల మధ్య ఎలాంటి అవగాహన పొత్తులు లేకపోవడం గమనార్హం. పోటీకి దూరంగా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే తెలంగాణ జనసమితి కూడా తాము పోటీ చేసే స్థానాలను మినహాయించి మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడంతో ఆ పార్టీ నాలుగు చోట్ల పోటీలో ఉన్న నామమాత్రమే కానుంది. ఇలా ఉండగా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే టీఆర్‌ఎస్ హైదరాబాద్ స్థానంలో మాత్రం మిత్రపక్షమైన ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించినప్పటికీ హైదరాబాద్ నుంచి మొక్కుబడిగా డమీ అభ్యర్థిని నిలబెట్టింది. కాగా టీఆర్‌ఎస్ పార్టీ ఏడు స్థానాలకు మాత్రమే సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపి, 10 స్థానాలలో కొత్త ముఖాలను బరిలోకి దింపడం విశేషం. మొత్తంగా 16 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రకటించినప్పటికీ వీటిలో సగం స్థానాలు ఆ పార్టీకి ప్రతిష్ఠాకరంగా మారాయి. వీటిలో నిజామాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, పెద్దపల్లి స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచిన నల్లగొండ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ బరిలో నిలిచిన మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి బరిలో నిలిచిన నిజామాబాద్, మాజీ కేంద్ర మంత్రులు రేణుకాచౌదరి బరిలో నిలిచిన ఖమ్మం, మరో కేంద్ర మంత్రి బల్‌రామ్ నాయక్ బరిలో నిలిచిన మహబూబాబాద్ స్థానాలు ప్రతిష్ఠాత్మకం. బీజేపీకి మాజీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి బరిలోకి దిగిన సికింద్రాబాద్, కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరి మహబూబ్‌నగర్ నుంచి బరిలో నిలిచిన డికె అరుణ, టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కుమారుడు అర్వింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలువడంతో ఈ మూడు స్థానాలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకం.