రాష్ట్రీయం

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 25: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యమైనదిగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రాబివృద్ధిలో ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం పోషించిన పాత్ర, రానున్న రోజుల్లో ప్రజలకు అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్టు తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లా అమరావతిలోని లింగాపురం నుండి కన్నా లక్ష్మీనారాయణ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నర్సరావుపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కన్నా లక్ష్మీనారాయణ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెదకూరపాడు శాసనసభకు పోటీచేస్తున్న గంధం కోటేశ్వరరావుతో కలిసి లింగాపురంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించుకుని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం అమరావతిలో నూతనంగా పార్టీలోకి చేరిన కార్యకర్తలకు కన్నా కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ మేనిఫెస్టోను మంగళవారం విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విచ్చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధించడం తధ్యమని, తిరిగి నరేంద్రమోదీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తచేశారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తీసుకున్న ప్యాకేజీకి లెక్కలు చెప్పమంటే లేనిపోని ఆరోపణలకు పూనుకుంటున్నారన్నారు. కాగా తొలిరోజు కన్నా ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది కార్యకర్తలు, పార్టీ నేతలు ప్రచారంలో కన్నా వెంట పాల్గొన్నారు.
చిత్రాలు.. కోదండరామస్వామి దేవస్థానంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుంటున్న కన్నా లక్ష్మీనారాయణ,
పార్టీలో చేరుతున్నవారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు