రాష్ట్రీయం

మళ్లీ ననే్న ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి/సత్యవేడు, మార్చి 25: తాను రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని ప్రజలు మరలా తననే ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వెంకటగిరి విచ్చేన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ హైద్రాబాద్‌లో 60 సంవత్సరాలు మన కష్టాన్ని కేసిఆర్ దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్ నుంచి లక్ష కోట్లు రావాల్సి ఉండగా దీనిని ఎగ్గొట్టేందుకు కేసిఆర్ జగన్‌తో కలిసి మనపై ధ్వజమెత్తారని ఆయన ఆరోపించారు. కేసిఆర్ ఒక దగాకోరు అని ఆరోపించారు. జరగనున్న ఎన్నికలు టీడీపీకి వైసీపీకి కాదని టీడీపీ-టీఆర్‌ఎస్ మధ్యేనని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేసిఆర్ ఆంధ్రులను ఎన్ని విధాలగా తిట్టారో మీ అందరికీ తెలుసని వాటిని గుర్తుపెట్టుకొని తెరాసతో రహస్య ఒప్పందంతో కలిసి పనిచేస్తున్న వైకాపాకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డిది కుటుంబ హత్యేనని దానిని మాఫీ చేసేందుకు ఇతరులపైకి తోసి సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రజలు జగన్‌కు ఓటు వేస్తే జైలుకు పోయినట్టేనని అన్నారు. జగన్ మాటలను నమ్మి ప్రజలు ఓటేస్తే రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తారని అన్నారు. వెంకటగిరి వైకాపా అభ్యర్ధి ఆనం రామనారాయణరెడ్డి అవకాశవాది అని అన్నారు. వెంకటగిరి రాజాలు అందరికి నీతులు చెపుతారని అలాంటి వారు చివరికి అవినీతి పరుడైన జగన్ పంచన చేరడం విడ్డూరంగా ఉందని అన్నారు.
గత ఎన్నికల ముందు తాను రాష్ట్రానికి పెద్దకొడుకుగా పనిచేస్తానని చెప్పానని ఆ మాటకు కట్టుబడి పనిచేశానని దానికి కూలిగా ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించాలని బాబు కోరారు. గతంలో కరెంట్ సక్రమంగా ఉండేదికాదని టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతే లేకుండా చేశామన్నారు. రైతులకు రుణమాఫి చేశామని, కొత్తగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు అన్నంపెడుతున్నామన్నారు. చంద్రన్న బీమా, ఆహార భద్రత, పండుగలకు కానుకలు ఇచ్చి ప్రజలను ఆదుకున్నామని అన్నారు. ప్రజలకు ఆరోగ్య భరోసాను పెంచుతూ 2,50,000 నుంచి వచ్చే ఏప్రిల్ నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. చేనేత కార్మికులకు రావాల్సిన సిల్క్ సబ్సిడినీ త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పొదుపు మహిళలు, వృద్ధులు, రైతులు తమకు అండగా ఉన్నారని వారి ఆశీర్వాదంతోనే మరలా టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న వెంకటగిరి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కురుగొండ్ల రామకృష్ణను, తిరుపతి ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న పనబాక లక్ష్మిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్ధి కురుగొండ్ల రామకృష్ణ, ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్, పెంచలకోన దేశం స్థానం చైర్మన్ గంగొటి నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ తానంకి నానాజీ, ఎ ఎంసి చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లం చంద్రమోహన్‌రావు, నాయకులు ఎల్ కోటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మించిన అభివృద్ధి ఏపీలో చేసి చూపిస్తా
నిరుద్యోగ భృతి పెంచుతాం
చిత్తూరు జిల్లా సత్యవేడు సత్యవేడులో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తనను మళ్లీ గెలిపిస్తే హైదరాబాద్ కంటే మెరుగైన, దేశం యావత్తూ మెచ్చుకునే విధంగా అభివృద్ధి, ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో చేసి తన సత్తా ఏమిటో నిరూపిస్తానని అన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో హీరో, మోటార్, అపోలో వంటి అనేక పరిశ్రమలు వచ్చాయి. ప్రస్తుత నిరుద్యోగులకు ఇస్తున్న రూ.2000ను పెంచుకుంటూ వస్తానని, మహిళలకు ఇస్తున్న పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని కూడా పెంచుతూ వస్తానన్నారు. ఇపుడు మన రాష్ట్రంలో ఎన్నికలు తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ కే కాదు తెలుగుదేశం-టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు అన్నారు. కేసీఆర్ అక్కడ సెక్రటేరియట్‌కు వెళ్లడు, ఇక్కడ జగన్ అసెంబ్లీకి రాడు. అలాంటి వ్యక్తికి అధికారం ఇస్తే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిది అని అన్నారు. తెలుగుగంగ ద్వారా చెరువులకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకుంటానని ఆయన అన్నారు.

చిత్రం.. సత్యవేడులో ఎన్నికల ప్రచారం సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు