రాష్ట్రీయం

లోక్‌సభ ఎన్నికల్లో అడ్రస్ లేని టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 18: పదేళ్లకైనా పెంటకు బలం వస్తుందన్న నానుడిని నమ్ముకుని తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు, మొండిగా కూర్చున్న వారి వద్దకు వెళ్లే మనిషి కనపడడం లేదు. తోడు, నీడ లేక కుదేలై కూర్చున్న తెలుగు తమ్ముళ్లును పలుకరించే నాథుడే కరువయ్యాడు. గడచిన శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు జతకట్టి బరిలోకి నిలువగా టీడీపీ శ్రేణులు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి అనే పేరు వినిపించకపోవడం, టీడీపీ తమ మద్దతుదారులను బరిలోకి దింపకపోవడంతో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల్లో పూర్తి నైరాశ్యాన్ని నింపికూర్చుంది. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మొదట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మెల్లమెల్లగా తన ప్రాబవాన్ని పెంచుకున్న ఆ పార్టీ 1994 సార్వత్రిక ఎన్నికల్లో ఉన్న అసెంబ్లీ స్థానాలన్ని కైవసం చేసుకుని తిరుగులేదని నిరూపించుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు రాష్ట్ర క్యాబినెట్‌లో కీలకమైన మంత్రి పదవులను సైతం అధిరోహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీఆర్, అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు సైతం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నాయకులు సఖ్యతతో వ్యవహించారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్‌టీఆర్, చంద్రబాబులకు నమ్మిన బంటులే అని చెప్పడంలో సందేహం లేదు. కేసీఆర్ ఒక దఫాలో తన కుమారుడి పేరును కూడా తారక రామారావుగా పెట్టుకున్నాడంటే ఎన్‌టీఆర్‌పై ఉన్న అభిమానానికి నిదర్శనమే అని చెప్పవచ్చు. 1999 సంవత్సరాంతంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మరోమారు అధికారం చేపట్టాక, అధినేతను విబేధించిన కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తెరలేపిన విషయం తెలిసిందే. అప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టమైన స్థితిలో కొనసాగుతూ వస్తోంది. 1999 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానాన్ని పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించగా సీనియర్ నాయకులు ఆలె నరేంద్ర మొదటి సారి గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. 2004లో చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, అప్పటికే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల పొత్తుతో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్, బలమైన ఓటు బ్యాంకుతో ఒకటి రెండు స్థానాలను దక్కించుకుని పరవాలేదనిపించుకుంది. 2009 ఎన్నికల్లో సైతం మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని తెలుగుదేశం శ్రేణుల్లో ఆశలు నింపింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో టీడీపీ ఉనికికే ప్రమాదం వచ్చిపడింది. జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక చతికిలపడిపోయింది.
తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. 2018 ఎన్నికల్లో జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పోటీకి సిద్దం కాలేకపోవడం పార్టీ పరిస్థితి ఏ విధంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ పట్టణాలు, గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని నేటికి నమ్ముకున్న వారు లేకపోలేదు. పదేళ్లకైనా పెంటకు బలం వస్తుందని..తమ పార్టీకి కూడా పూర్వవైభం రాకమానదంటూ పార్టీని వీడకుండా బీష్మించుకుని కూర్చున్న దిగువ శ్రేణీ నాయకులు చాలా మంది ఉన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అండగా నిలిచేందుకు పెద్ద దిక్కుగా మేమున్నామని చెప్పే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు లేకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు.