రాష్ట్రీయం

అధిష్ఠానంపై రాయపాటి అలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తనకు, తన కుమారుడు రంగబాబుకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించే విషయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుకు నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు నొచ్చుకున్నారు. నర్సరావుపేట ఎంపీ టిక్కెట్ కేటాయిస్తున్నట్లు చెప్పినప్పటికీ అధికారికంగా ప్రకటించక పోవడం, వేరు వేరు అభ్యర్థులకు కేటాయిస్తున్నట్లు వార్తలు రావడం రాయపాటి అలకకు కారణంగా కన్పిస్తున్నాయి. తన కుమారుడు రాయపాటి రంగబాబును సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన సాంబశివరావు ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే, స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ఖరారు చేయడంపై కినుక వహించారు. దీంతో రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తికి లోనై తన అనుయాయుల వద్ద అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం బయటకు పొక్కిన వెంటనే పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆయన అభిమానులు గుంటూరులోని రాయపాటి గృహానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పార్టీలో ఆదరణ లేనప్పుడు మనమెందుకు ఉండాలంటూ ముఖ్య నేతలు, కీలక అనుచరులు రాయపాటి ఎదుట అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అధిష్ఠానం.. మంత్రి లోకేష్, ఎంపీ, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరిలకు రాయబార బాధ్యతలు అప్పగించింది. అధిష్ఠానం ఆదేశం మేరకు నేతలిరువురూ రాయపాటికి ఫోన్ చేసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, అధినేత న్యాయం చేస్తారని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, పలువురు ముఖ్య నేతలు రాయపాటి ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. అనంతరం ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ నర్సరావుపేట ఎంపీ సీటుకు తనకంటే మంచివారు, సీనియర్ నేత ఎవరైనా ఉంటే వారికి కేటాయించవచ్చని అన్నారు. జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ రాయపాటి పేరు తెలియని వారు ఉండరని, రాయపాటి కుటుంబం ఏనాడూ కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగలేదని స్పష్టంచే శారు. 30 ఏళ్లుగా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సీటు ఇచ్చినా, ఇవ్వక పోయినా పార్టీ మారేది లేదని రాయపాటి స్పష్టంచేశారు.
చిత్రం.. రాయపాటితో చర్చలు జరుపుతున్న జీవీ ఆంజనేయులు తదితరులు