రాష్ట్రీయం
ముగిసిన పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 February 2019
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 21: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు వైభవంగా కొనసాగి గురువారం శతఘటాభిషేకం, పూర్ణాహుతి, మహదాశ్వీరచనం, పండిత సన్మానంతో ముగిశాయి. లక్ష్మీనరసింహులకు వివిధ అవతారాల అలంకార, వాహన విశేష సేవలతో, తిరు కల్యాణోత్సవంతో వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శతఘటాభిషేకం, పూర్ణాహుతి, మహాదాశ్వీరఛనం నిర్వహించారు. పాంఛరాత్ర ఆగమ శాస్త్రానుసారం అధ్యంతం కమనీయ వేడుకగా సాగిన బ్రహోత్సవాల నిర్వాహణలో భాగస్వామ్యమైన అర్చక, యాజ్ఞీక, వేద పండిత బృందానికి ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తిలు సన్మానం నిర్వహించారు.