రాష్ట్రీయం

ఈ ఏడాదీ 24గంటల కరెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున సాగర్: గత ఏడాది లాగానే ఈ సారి కూడా ఎండాకాలంలో నిరంతరంగా రాష్ట్రంలో 24గంటలు కరెంటు సరఫరా చేస్తామని తెలంగాణ రాష్ట్ర జన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఉద్ఘాటించారు. గురువారం నాగార్జున సాగర్‌కు చేరుకున్న ఆయన మొదటగా ఎడుమకాలువపై ఉన్నటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం పైలాన్ కాలనీలోని ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఆదివారం రాత్రి ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో రివర్సిబుల్ టర్బైన్ ద్వారా డ్యాం దిగువ భాగాన ఉన్న నీటిని సాగర్ జలాశంలోకి పంపించేసే దశలో పెన్‌స్టాక్ పైపు తెరుచుకోకపోవడంతో నీరు పెన్‌స్టాక్ పైపులకు ఉన్న ఎయిర్ వాల్స్ ద్వారా బయటకు వచ్చి స్వీచ్ యార్డ్‌లో పడడంతో ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. ఈ విషయమై గురువారం ఆయన పరిశీలనకై వచ్చారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఎండాకాలంలో విద్యుత్ ఇబ్బంది లేకుండా కరెంటును సరఫరా చేస్తామని రాష్ట్రంలో కరెంటు వినియోగానికి డిమాండ్ పెరుగుతూ వస్తుందన్నారు. 11వేల మిలియన్ యూనిట్ల వరకు ఈ డిమాండ్ ఉండవచ్చిని అంచనా వేస్తున్నామని దానికి తగినట్లుగా ముందస్తుగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ మరో నాలుగున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత భూపాలపల్లి లోయర్ జూరాల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తిని ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతున్నామని ఆయన తెలిపారు. కరెంటు స్టోరేజ్ విషయంలో పరిశోధనలు జరుగుతున్నాయని ఆ పరిశోధనలు పూర్తయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో జరిగిన సంఘటన విషయంలో సాంకేతిక తప్పిదంగా తెలిందని సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు. ఆయనతో పాటు హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజన్, జన్‌కో సీఈలు ఉపేంద్ర, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు