రాష్ట్రీయం

నేరస్థులతోనే పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో పోటీ పడేది నేరస్థులతో అని, ప్రత్యర్థుల నేర చరిత్రను గుర్తుంచుకోవాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో గురువారం ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్యలు, దోపీడీలు, దాడులు ప్రత్యర్థుల సంస్కృతి అని, ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైకాపా అని ధ్వజమెత్తారు. తప్పుడు పనులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తత అవసరమని, ఈ ఎన్నికల్లో నేరస్థులతో పోటీ పడుతున్నామన్నారు. చేయని తప్పులను మనపై రుద్దుతారని, తప్పులు జరిగేలా స్కెచ్‌లు వేస్తారన్నారు. ఒక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలన్నారు. రాజధానిలో లక్ష కోట్ల రూపాయలు అనినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని, దానిని తాను ఖండిస్తే, వెనక్కి పోయారన్నారు. భూములు రైతుల వద్దే ఉంటే అవినీతికి చోటెక్కడ అని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టారని, రైతులు వినకపోతే విధ్వంసానికి తెగపడ్డారని ఆరోపించారు. అరటి తోటలు ధ్వంసం చేసి, చెరకు తోటలు తగులబెట్టారని విమర్శించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారని, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులు వేశారన్నారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను తీసుకువచ్చిన పార్టీ వైకాపా అని మండిపడ్డారు. నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్ కుటుంబమని, మోదీ, జగన్, షా, కేసీఆర్ కుమ్మక్కై కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. ఆ నలుగురి కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మోదీ, కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. సామాన్యుల్లో భయం పెంచుతున్నారన్నారు. ఓటమి భయంతో కుట్రల మీద కుట్రలు చేస్తూ, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. వీటన్నింటినీ తిప్పి కొట్టి, ప్రజలకు వాస్తవాలు వివరించాలన్నారు. వీరి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందన్నారు. నేతలు, కార్యకర్తలు అందరిలో పట్టుదల పెరగాలని, అన్ని చోట్ల గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తున్నామని, 4 ఎంపీ సీట్లకు సంబంధించి కసరత్తు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. అన్ని అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు, ఏరియా కో-ఆర్డినేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులతో సమీక్ష సందర్భంగా భేటీ అవుతానన్నారు. టీడీపీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అందరికీ జవాబుదారీ తనం ఉండాలన్నారు. బుధవారం జరిగిన ఉద్యోగ సంఘాల భేటీ స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. విభేదాలు వీడి ఉద్యోగులంతా సంఘీభావం ప్రకటించారన్నారు. మళ్లీ మనమే రావాలని ఉద్యోగుల కోరుకుంటున్నారన్నారు. ఉద్యోగుల్లో సానుకూలత శుభపరిణామని అభివర్ణించారు. అభివృద్ధిలో ఉద్యోగుల సహకారం కీలకమన్నారు. దళితులను అవమానించేలా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడారని వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను టీడీపీ అధిష్ఠానం పరిశీలించింది. వీడియోను ఎడిట్ చేసి వైకాపా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టినట్లు ధ్రువీకరించారు. వైకాపా వాళ్లే సీన్ క్రియేట్ చేస్తారని, వాళ్లే దుష్ప్రచారం చేస్తారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారని, వీడియోలను కూడా కటింగ్ చేస్తారని విమర్శించారు. ప్రతిపక్షం చేసే తప్పుడు పనులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ ముఖ్యమంత్రి శుభకాంక్షలు తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వృతి ప్రావీణ్యత కోసం ఆంగ్ల పరిజ్ఞానం అవసరమన్నారు. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ప్రామాణికమని వ్యాఖ్యానించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతలను చాటి చెప్పాలన్నారు.
కొత్త తరం ఓటర్లే ఎక్కువ
త్వరలో జరుగనున్న అసంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్టీఆర్ గురించి వారికి తెలియచెప్పాలన్నారు. తెలుగుజాతి చరిత్ర, ఎన్టీఆర్ చరిత్రపై అవగాహన పెంచాలన్నారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కుట్రదారుల ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందరికీ చాటి చెప్పాలన్నారు. మహానాయకుడు, కథానాయకుడు సినిమాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.