రాష్ట్రీయం

కాంగ్రెస్ విజయం.. దేశానికి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్ నుంచి మంగళవారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డీసీసీ అధ్యక్షులు, మండల నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరున విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉండటంతో పార్టీ నేతలు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రి చేయాలన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త అమితంగా కష్టపడాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు రాహుల్‌గాంధీ, మోదీకి మధ్య జరిగే ఎన్నికలన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో రాష్ట్ర, దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. మోదీ ప్రధాన మంత్రి అయ్యాక దేశ ప్రగతి దిగజారిపోవడంతో పాటు మైనార్టీలు అభద్రతాభావంలోకి నెట్టబడ్డారన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది, వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, కనీసం రెండు లక్షల మందికి కూడా ఇవ్వలేకపోయారన్నారు. పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే నిరుద్యోగ సమస్యతో పాటు వ్యవసాయరంగాన్ని గట్టెక్కించడానికి అన్ని చర్యలు తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే వారు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14 వరకు గడువు పెంచడంతో కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులు కూడా తమ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరుంటే బాగుంటుందో సిఫార్సు చేయవచ్చని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో సమీక్షా సమావేశాలు ఉంటాయన్నారు. ఈ నెల 15న ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్ నియోజకవర్గాలు. 16న నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, 17న మెదక్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల సమావేశాలు ఉంటాయని తెలిపారు. పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా ఉంటారన్నారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సమీక్షా సమావేశాలకు బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసి ఆ జాబితాలను పార్టీకి అందజేయాల్సి ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థులను రాహుల్‌గాంధీనే ఎంపిక చేస్తారన్నారు. అలాగే డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారన్నారు.