రాష్ట్రీయం

కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లకు భలే గిరాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఉత్తరాదిలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, కేంద్రంలో తిరిగి అధికారంలోకి రాబోతుందన్న ప్రచారంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీకి అభ్యర్థులు ఎగబడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి గత మూడు రోజులుగా దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ) శ్రీకారం చుట్టడంతో దండిగా వచ్చాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా జారీ కాకపోవడంతో దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలని పార్టీ సీనియర్ల సూచన మేరకు ఈ నెల 14 వరకు పొడిగించినట్టు పీసీసీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 10న ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించగా, తాజాగా మరో రెండు రోజులు పెంచింది. దీంతో ఈ నెల 14 వరకు దరఖాస్తుల స్వీకరించనుంది. ఇలా ఉండగా ఈ నెల 10న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ మొదటి రోజునే 25 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో పార్టీ సీనియర్లు, మాజీ ఎంపీలు పలువురు ఉన్నారు. రెండు, మూడవ రోజు కూడా పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు అందినప్పటికీ గడువు ముగిసిన తర్వాతనే మీడియాకు వెల్లడించాలని పీసీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో సిట్టింగ్ ఎంపీల సంఖ్య ఇద్దరికి చేరింది. కాంగ్రెస్‌లో చేరికకు ముందే పార్లమెంట్ ఎన్నికల్లో విశే్వశ్వర్‌రెడ్డికి చేవెళ్ల నుంచి తిరిగి టికెట్ ఇవ్వడానికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీలు నంది ఎల్లయ్య, విశే్వశ్వర్‌రెడ్డి ఇద్దరికి తిరిగి టికెట్ ఖాయమైనట్టే. మిగిలిన 15 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థుల ఖరారుకు కసరత్తు జరగాల్సి ఉంది. పార్లమెంట్ స్థానాల టికెట్ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో టీపీసీసీ స్థాయిలోనే వడబోసి మూడేసి పేర్లను అధిష్టానానికి పంపించాలని నిర్ణయించింది. ఒకవైపు దరఖాస్తులు స్వీకరిస్తూనే మరోవైపు అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం దృష్టిసారించింది. పార్టీ పరిశీలకులు, సర్వే సంస్థల ద్వారా వేర్వేరుగా టికెట్ ఆశిస్తున్న ఆశావహులపై కసరత్తు చేస్తోంది.
చిత్రం.. గాంధీభవన్‌లో మంగళవారం పార్లమెంటు టికెట్ ఆశావహుల నుంచి
దరఖాస్తులు స్వీకరిస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి