రాష్ట్రీయం

వేదఘోష నడుమ ఆదిత్యుని క్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: ప్రత్యక్షదైవం అరసవల్లి శ్రీ ఉషా పద్మినీ ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి మహాక్షీరాభిషేకం సూర్య జయంతి పర్వదినాన మంగళవారం కన్నుల పండువగా జరిగింది. ఏడాదికోసారి స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విళంబి నామ సంవత్సర మాఘ శుద్ధ సప్తమీ మంగళవారం రథసప్తమి ఉత్సవాన్ని వీక్షించిన భక్తజన కోటి తన్మయం చెందారు. సోమ, మంగళవారం మధ్యంతరంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ఆదిత్యుని మూలవిరాట్ నిజరూపదర్శనం భక్తులకు మరపురాని అనుభూతి కలిగించింది. ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ నిర్వహణలో అర్చక బృందాలు వేదమంత్రాలతో నమక, చమక, పురుష స్రీ సూక్త మహాన్యాస పూర్వక రుద్రాభిషేక పూజలు చేశారు. రుద్ర స్వరూపునిగా స్వామివారిని కొనియాడుతూ వేదమంత్రాలను పఠిస్తూ ఆయలంలో ‘ఓం హ్రీం ఘృణిసూర్య ఆదిత్య శ్రీమ్’ మూలమంత్రంతో మరింత శోభ చేకూర్చారు. సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ సేవల్లో పాల్గొని ఆరోగ్య, ఐశ్వర్య, నేత్రరోగ నివారణ కోరుకుంటూ మొక్కుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పుష్పనాథం, ఆర్డీవో రమణల తొలిపూజలతో సూర్యజయంతి మహోత్సవాలను ప్రారంభించారు. స్వామివారికి ఆలయ సాంప్రదాయంగా పట్టువస్త్రాలను సమర్పించారు. వంశపారంపర్య ధర్మకర్త ఇప్పిలి జోగిసన్యాసిరావు ఇతర వేదపండితులంతా తొలి మహాక్షీరాభిషేకానికి కావల్సిన పాలు, పండ్లరసాలు, పంచామృత స్నానానికి పూజా సామగ్రిని అందించారు. పక్క రాష్ట్రాలు, జిల్లాల ననుంచి వచ్చిన వేలాది మంది భక్తులు ఈ మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొని ఆరోగ్య, ఐశ్వర్య, నేత్ర రోగ నివారణ కోరుకుంటూ బంగారం, వెండి కళ్ళ ప్రతిమలు మొక్కుబడులుగా ఇచ్చారు. ఈ రథసప్తమి ఉత్సవంలో మంత్రులు, రాజకీయ పెద్దలు హాజరు కాలేకపోయారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్షతోపటు, మరుసటి రోజున పాదయాత్ర రాష్టప్రతిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బాబు వెంట మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉండిపోవడంతో వారి కుటుంబ సభ్యులు మహాక్షీరాభిషేకంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శీరిషా, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.సూర్యజయంతి సందర్భంగా మంగళవారం స్వామివారికి మహాక్షీరాభిషేకం నిర్వహించి, నిజరూపదర్శనం చేసుకున్న భక్తులు కుంభ సంక్రమణం కారణంగా బుధవారం కూడా ఆదిత్యుని నిజరూపదర్శనం చేసుకునే అవకాశం కలిగింది. 60 ఏళ్ళుకుగాని ఇలా రథసప్తమి, కుంభ సంక్రమణం వరుసగా రెండురోజులు శుభదినాలు రావని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ చెప్పారు.