రాష్ట్రీయం

సీపీఐ జాబితా ఇదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. హుస్నాబాద్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కొత్తగూడెం నుంచి కూనమనేని సాంబశివరావు, వైరా నుంచి డాక్టర్ విజయ్, బెల్లంపల్లి నుంచి మల్లేష్, మునుగోడు నుంచి సత్యం యాదవ్ పోటీ చేస్తారు. మహాకూటమి నుంచి తాము పూర్తిగా వైదొలగలేదని చాడ వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. కూటమిలోని మిత్రపక్షాల నేతలతో చర్చలు జరుపుతునే ఉన్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చే వారు తాము తీసుకునే వారిగా భావించరాదని ఆయన అన్నా రు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే ధ్యేయంగా ధ్యేయంగా మహాకూటమి ముందుకు పోతోందని చాడ చెప్పారు. ఈ విషయంలో మిత్ర పక్షాలు సమష్టిగా ప్రచారం చేస్తాయని సీపీఐ నేత స్పష్టం చేశారు. కాంగ్రెస్ నిర్ణ యంపై మరో రోజు వేచి చూస్తామన్నారు.