తెలంగాణ

నేటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంనుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరుగనుంది. ఇందులో బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేస్తారు. శాసనసభలో ఈ నెల 14వ తేదీన ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెడుతారు. బడ్జెట్ సమావేశాలలో ప్రధానంగా ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, గోదావరి, పెనుగంగ, ప్రాణహిత నదులపై నిర్మించబోయే ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాలపై చర్చ జరుగనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం వివిధశాఖలు బడ్జెట్‌లోప్రతిపాదించిన అంశాలపై సభలో చర్చలు ముగిసిన అనంతరం వాటికి ఆమోదం పొందనున్నాయి. అలాగే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానే ప్రవేశపెట్టనున్న బిల్లులకు ఆమోదం పొందిన తర్వాత చివరగా ద్రవ్యవినీమయ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ సమావేశాలు ముగిస్తాయి. ఇలా ఉండగా ఇటీవల టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు తమను టిఆర్‌ఎస్ శాసనసభా పక్షంగా గుర్తించాలని స్పీకర్‌కు రాసిన లేఖపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

చిత్రం... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి