తెలంగాణ

ప్రాజెక్టులపై బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టులు
1. ప్రాణహిత ప్రాజెక్టు (తమ్మిడిహట్టి బ్యారేజి),
కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజి)
2. లెండి ప్రాజెక్టు
3. పెనుగంగపై రాజుపేట వద్ద బ్యారేజీ
4. పెన్‌గంగపై చనాఖా-కొరాట మధ్య బ్యారేజీ
5. పెన్‌గంగపై పంపరాడ్ వద్ద బ్యారేజీ
6. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు

హైదరాబాద్: గోదావరిపై నిర్మించే అంతరాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ- మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహంలో మంగళవారం ఉదయం ఇరు రాష్ట్రాల సిఎంలు కె చంద్రశేఖర్‌రావు, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య గతంలో జరిగిన అంతరాష్ట్ర ప్రాజెక్టుల ఒప్పందాలు, భవిష్యత్‌లో గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులను పరిశీలించడానికి అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసుకోవడానికి పరస్పరం అంగీకరించడం కీలక నిర్ణయం. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ 1979 (తదుపరి నివేదిక 1980) పరిశీలనకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర మండలి పర్యవేక్షణ సంస్థగా పని చేయడం ఒప్పందంలో మరో ప్రధానమై నిర్ణయం. ఆరు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశాలను అంతరాష్ట్ర మండలి (బోర్డు) పర్యవేక్షిస్తుంది. వీటిపై ఏవైనా సందేహాలు, అనుమానాలు, సమస్యలుంటే వాటిని బోర్డు పరిష్కరించే విధంగా అంగీకారం కుదిరింది. అలాగే గతంలో మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలనూ బోర్డు పరిగణలోకి తీసుకుంటుంది. బోర్డుకు ఒక ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి , మరుసటి ఏడాది మహారాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఒక ముఖ్యమంత్రి చైర్మన్‌గా కొనసాగుతున్నప్పుడు, మరో సిఎం బోర్డు కో-చైర్మన్‌గా వ్యహరిస్తారు. బోర్డులో ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ, ఆర్థికశాఖ మంత్రులు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు ఆర్థికశాఖ, అటవీశాఖ, రెవిన్యూశాఖ కార్యదర్శులు, ఇంజనీరింగ్- ఇన్- చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు. బోర్డు సమావేశాలు ఒక దఫా హైదరాబాద్‌లో జరిగితే, మరో దఫా ముంబయిలో జరపాలని ఒప్పందంలో పేర్కొన్నారు. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల సాంకేతిక అంశాలకు బోర్డు పరిష్కారం చూపుతుంది. సాంకేతిక కమిటీ చేసే సిఫారసులకు బోర్డు అమోదం తెలుపుతుంది. గోదావరిపై ఇరు రాష్ట్రాలు కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులతో పాటు, గతంలోని ఒప్పందాలన్నీ ఒకే ఛత్రం పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన ఈ చారిత్రక ఒప్పందానికి రాష్ట్రం నుంచి మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటిపారుదల రంగ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి తదితరలు హాజరయ్యారు.