తెలంగాణ

మహాశివరాత్రికి వేములవాడ ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి జాతర శోభ సంతరించుకుంది. తెలంగాణ అతిపెద్ధ శైవక్షేత్రమైన, దక్షిణకాశీగా ఖ్యాతి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఇక్కడ జరిగే ఉత్సవానికి తెలంగాణ జిల్లాల నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర , ఒడిషా నుంచి సుమారుగా మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా. జాతర కోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లును ముమ్మరంగా చేపట్టింది. కలెక్టర్ నీతూప్రసాద్ అధ్యక్షతన జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శివుడు ఉద్భవించిన కాలంలో స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఉదయం నుంచి తెల్లవారుజాము వరకూ భక్తులు నిల్లారం పాటిస్తూ ఆ పరమ శివుడిని ఆరాధిస్తారు. జాగరణలతో స్వామివారిని కొలుస్తారు. ఉదయం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానాల తరుపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు కళ్యాణ మండపంలో లింగార్చన, రాత్రి 11.35 గంటలకు 11 మంది రుత్వికులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు.

సోమవారం నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ఆలయంలో మూడు రోజుల పాటు స్వామివారికి నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు.

విద్యుత్ కాంతుల మధ్య వెలుగొందుతున్న రాజన్న ఆలయం

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవికి
అభిప్రాయ సేకరణ
హైదరాబాద్‌కు వచ్చిన పార్టీ నేత కృష్ణదాస్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 6: బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్ష పదవికి నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకునేందుకు పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ కృష్ణదాస్ ఆదివారం పార్టీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే కృష్ణదాస్ నగరానికి వచ్చిన విషయం పార్టీలో చాలామందికి తెలియకపోవడంతో, చాలా స్వల్ప సంఖ్యలో నాయకులు ఆయనను కలుసుకున్నారు. సోమవారం కూడా ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఆదివారం కృష్ణదాస్‌ను కలిసిన నాయకుల్లో కొందరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేరును ప్రతిపాదించగా, మరికొందరు పార్టీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ పేరును, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పేరును, ఎమ్మెల్యే రామచందర్‌రావు పేరును, మాజీ ఎమ్మెల్యే, బిజెపి మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పేరును సూచించారు. కృష్ణదాస్ సోమవారం కూడా అభిప్రాయ సేకరణ జరిపి ఆ తర్వాత ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నివేదించనున్నారు. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుని ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి రాష్ట్ర విభజనకు ముందు నుంచీ కొనసాగుతున్నందున, ఇప్పుడు ఆయన తిరిగి ఎన్నికయ్యే అవకాశం లేదని పార్టీ నాయకులు అంటున్నారు. కిషన్‌రెడ్డి కూడా ఇంకా కొనసాగేందుకు అనాసక్తత వ్యక్తం చేస్తున్నారు.