తెలంగాణ

ఆఖరి శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘తుది శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా...నేను మరణించిన తర్వాత నా భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా ఉంచాలని కోరుకుంటున్నాను’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన ఆదివారం అనూహ్యంగా సాక్షి దినపత్రిక కార్యాలయం ముందు బైఠాయించి సుమారు గంటసేపు నిరసన ధర్నా చేశారు. దాదాపు వందమంది కార్యకర్తలు ఆయనకు మద్దతుగా బైఠాయించారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు పత్రికలో తప్పుడు ప్రచారం చేశారని పొన్నాల విమర్శించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరచడం సరైంది కాదని అన్నారు. తాను అసలైన కాంగ్రెస్‌వాదినన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని, తమ పార్టీ సీనియర్ నాయకులపట్ల టిఆర్‌ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టిఆర్‌ఎస్ విష ప్రచారం చేస్తున్నదని పొన్నాల మండిపడ్డారు.

గీతారెడ్డా? డికె అరుణా?

పిఎసి చైర్‌పర్సన్ పదవిపై టి- కాంగ్రెస్ సందిగ్ధం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 6: తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్‌గా ఎవరి పేరును ప్రతిపాదించాలా? అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆలోచనలో పడ్డాయి. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి పిఎసి చైర్మన్ ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు కొత్త పేరును అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి తెలియజేయాల్సి ఉంది. ఈ నెల 10నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నందున త్వరగా పిఎసి చైర్మన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మాజీ మంత్రులైన గీతారెడ్డి, డికె అరుణ సీనియర్లు. లోగడ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసి అనుభవం గడించిన మల్లు భట్టివిక్రమార్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నందున ఆయన పేరును ప్రతిపాదించే అవకాశం లేదని పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.
9, 10 తేదీల్లో సిఎల్‌పి
ఇలాఉండగా ఈ నెల 9, 10 తేదీల్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కాబోతున్నది. 9న జరిగే సిఎల్‌పి సమావేశంలో ఇటీవల మరణించిన పార్టీ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ రాంరెడ్డి వెంకట్ రెడ్డికి నివాళి అర్పిస్తారు. 10న జరిగే సమావేశంలో అసెంబ్లీలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడంతో పాటు పిఎసి చైర్మన్‌గా ఎవరి పేరును స్పీకర్‌కు ప్రతిపాదించాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.