తెలంగాణ

అష్టముఖ గండభేరుండ లక్ష్మీనరసింహ యాగం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక కళ్యార్థం, విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బుధవారం అష్టముఖ గండ భేరుండ లక్ష్మీనరసింహ మహాయాగం వేదమంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమైంది. 6వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత మహాయాగాన్ని వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి రధంపైకి తోడ్కొని మేళతాళాలతో మహాయాగం వద్దకు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందగిరి స్వామి ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి సముద్రం వంటిదని, మన మతం అందరినీ ఆదరించి గౌరవించేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి విలక్షణమైనదని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పవిత్రతను కాపాడుతాయని, సమాజాన్ని ఉద్దరిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ను పరిపూర్ణానందగిరి స్వామి ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పరిపూర్ణనంద సరస్వతి స్వామి, నిత్యాశుద్ధానందగిరి స్వామి, ఆచార్య పరిశుద్ధానందగిరిస్వామి, అసంగానందగిరి స్వామి, అనంతగిరి మాతాజి, అమృతానందగిరి మాతాజితో పాటు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రాఘవులు, కసిరెడ్డి వెంకటరెడ్డి, యాగకమిటీ చైర్మన్ అయిత రాములు పాల్గొన్నారని ప్రచార కమిటీ చైర్మన్ వెంకటేష్ తెలిపారు.