తెలంగాణ

భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: తెలంగాణ -్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొచ్చెలంక అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుఝామున భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అవుతున్నారనే నిఘా వర్గాల పక్కా సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. గత రెండు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు పామేడు పోలీసుస్టేషన్ పరిధిలో తెల్లవారుఝామున మావోయిస్టులను పసిగట్టాయి. అయితే మావోయిస్టులు ప్రతిఘటించడంతో గ్రేహౌండ్స్ కూడా కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మహిళా నక్సల్స్ సహా 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు. సంఘటన స్థలంలో 5 ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక ఏకే-47 అత్యాధునిక తుపాకులు లభ్యం కావడంతో మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉంటారని భావించారు. ప్రధానంగా తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అతని భార్య జెజ్జెర సమ్మక్క అలియాస్ సోనీ అలియాస్ శారదతో పాటు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి కుంజా వీరన్న అలియాస్ లచ్చన్నలు ఉన్నారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు మూడు హెలీకాప్టర్ల ద్వారా మృతదేహాలను భద్రాచలం తరలించడం, అక్కడికి మీడియాను సైతం అనుమతించక పోవడం, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో కూడా మీడియాకు అనుమతి ఇవ్వకపోవడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. చివరకు చనిపోయిన లచ్చన్న వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న కాదని, అందరూ ఛత్తీస్‌గఢ్ దళ సభ్యులేనని తేలింది. అయితే మిగిలిన వారి పేర్లను గుర్తించాల్సి ఉంది. రెండు మృతదేహాలకు ఒక తహశీల్దారు, ఒక్కో మృతదేహానికి ఒక్క వీఆర్‌ఓ చొప్పున, స్థానికుల సాయంతో శవపంచనామా నిర్వహించారు. గతంలో 2013 ఏప్రిల్ 16న జరిగిన పువ్వర్తి ఎన్‌కౌంటర్‌లో కెకెడబ్ల్యు కమిటీ తుడుచు పెట్టుకుపోయింది. అయితే ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి బలగాలను వెనక్కు తీసుకొచ్చే సమయంలో హెలీకాప్టర్‌పై మావోయిస్టులు దాడి చేసి, సీఐ వరప్రసాద్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ దాడిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగానే మూడు హెలీకాప్టర్లను రంగంలోకి దించింది. రెండు హెలీకాప్టర్లు సంఘటనా స్థలంలో ఏరియల్ పెట్రోలింగ్ నిర్వహించగా మరో హెలీకాప్టర్ ద్వారా బలగాలను, మృతదేహాలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భద్రాచలం ఏఎస్పీ, కొత్తగూడెం ఇన్‌ఛార్జ్ ఓఎస్‌డీ భాస్కరన్, సీఐలు సారంగపాణి, షుకూర్, దోమల రమేశ్, నరేందర్‌లతో పాటు ఎస్సైలు కరుణాకర్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. శవపంచనామా వద్ద భారీ భద్రత కల్పించారు.

చిత్రం... ఏరియా ఆసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలు