తెలంగాణ

గోప్యంగా ‘రోహిత్’ కమిటీ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య పూర్వాపరాలపై ఏకసభ్య కమిషన్ జస్టిస్ అశోక్ కుమార్ రూపన్‌వాలా గురువారం నాడూ నాంపల్లి గోల్డెన్ థ్రెషోల్డ్ దూర విద్యా కేంద్రం (సిడివిఎల్)లో విచారణ కొనసాగించారు. సెలవులో ఉన్న విసి ప్రొఫెసర్ అప్పారావు, తాత్కాలిక విసి ఫ్రొఫెసర్ ఎం పెరియసామి, రిజిస్ట్రార్ సుధాకర్, ప్రొఫెసర్ శ్రీవాస్తవ ఇతర సీనియర్ అధికారులు తమ వాంగ్మూలాలను ఇచ్చారు. అయితే మరికొంత మంది యూనివర్శిటీ అధికారులు వాంగ్మూలాలను ఇచ్చేందుకు గైర్హాజరైనట్టు సమాచారం. కాగా సాయంత్రం ఎబివిపికి చెందిన నేతలు కొంత మంది కమిషన్ ముందు హాజరై తమ వాదనలను వినిపించారు. అంతకుముందు కమిషన్ చీఫ్ ప్రోక్టార్, చీఫ్ వార్డెన్, వార్డెన్‌లు, డీన్, సమాన అవకాశాల సెల్ అధికారుల నుండి, స్టూడెంట్స్ గ్రీవెన్స్ సెల్, ర్యాగింగ్ సెల్ ప్రతినిధుల నుండి అభిప్రాయాలను సేకరించింది. అయితే రోహిత్ తరఫున, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున విద్యార్ధులు ఎవరూ కమిషన్ ముందు వాంగ్మూలాలను ఇవ్వలేదని సమాచారం. బహిరంగ విచారణ నిర్వహిస్తున్నా యూనివర్శిటీ ప్రతినిధుల వరకే విచారణ పరిమితం అయింది. మీడియాను అనుమతించలేదు. దాంతో కమిషన్ ముందు అధికారుల వాంగ్మూలాలు లిఖితపూర్వకంగా గోప్యంగానే ఉంచారు. కమిషన్ ముందుకు రాలేకపోయిన వారు యుఓహెచ్‌ఎంక్వయిరీకమిషన్ డాట్ యుజిసి ఎట్‌ద రేట్ జిమెయిల్ డాట్ కామ్‌కు పంపించవచ్చని కమిషన్ సిబ్బంది చెప్పారు. అలాగే యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ రీజనల్ ఆఫీసులో కూడా తమ ఫిర్యాదులను దాఖలు చేయవచ్చని తెలిపారు. వాస్తవ పరిస్థితిని ఏకసభ్య కమిషన్ ముందుంచామని వర్శిటీ రిజిస్ట్రార్ ఎం సుధాకర్ చెప్పారు. గురువారం నాటితో కమిషన్ తొలి దశ విచారణ పూర్తయింది. త్వరలోనే మలిదశ విచారణ ఉంటుందని తెలిసింది. మరికొంత మంది విద్యార్థులు తమ వాదనలను వినిపించేందుకు మరోమారు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.