తెలంగాణ

వేములవాడ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ: శృంగేరీ పీఠాధిపతి ఆశీస్సులతో త్వరలో 100 కోట్లతో ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి పనులను చేపడతామని ‘వాడా’ వైస్‌చైర్మన్, సిఇవో ముద్దసాని పురుషోత్తంరెడ్డి తెలిపారు. వైస్‌చైర్మన్‌గా చార్జ్ తీసుకున్న అనంతరం తొలిసారి మంగళవారం వేములవాడ రాజన్న కోవెలను సందర్శించి పూజలు గావించుకున్న అనంతరం ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఇవో ఇతర శాఖ అధికారులతో కలసి ఆలయ చెరువు కట్ట మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించారు. తదుపరి ఆలయ అతిథిగృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ది చేపట్టాలని సిఎం కేసిఆర్ ఆదేశించారన్నారు. రానున్న 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని తొందరపడకుండా ఒకటి రెండుమార్లు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని, ప్రతి ఒక్కరు ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాడా పరిధిలో వేములవాడ నగర పంచాయతీతో పాటుగా సంకేపల్లి, నాంపల్లి, తిప్పాపూర్, చంద్రగరి, మారుపాక గ్రామాలతో పాటుగా కోనాయిపల్లి గ్రామం సైతం ఈ పరిధిలోనికి వస్తుందని, తొలుత గుడిచెరువుపై సుందరీకరణ, ట్యాంక్‌బండ్, ఆలయంలో రెండవ ప్రాకారం పనులు ప్రారంభిస్తామని, దశలవారీగా నిధుల విడుదల బట్టి అభివృద్ది పనులు జరుగుతాయన్నారు. పరిపాలనాదక్షుడైన రిటైర్డ్ కలెక్టర్‌ను వాడా వైస్‌చైర్మన్‌గా నియమించినందుకు సిఎం కేసిఆర్‌కు ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో దూస రాజేశ్వర్, దేవాదాయశాఖ స్థపతి వల్లినాయగం, ఆర్డీవో బిక్షునాయక్, తహశీల్‌దార్ రమేశ్, నగరపంచాయతీ చైర్మన్ నామాల ఉమాలక్ష్మిరాజం, డిఎస్‌పి నల్ల మల్లారెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎంపిపి వెంకటేశ్‌గౌడ్, ఇంజనీరింగ్‌శాఖ అధికారులు, ఆలయ ఎఇవోలు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

పట్టుకున

వ్యక్తులకు కాదు..
చట్టానికి భయపడాలి

అధికారుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు హితవు
ఇరిగేషన్ శాఖ ఖేడ్ డిఇ తొలగింపు, కంగ్టి జెఇకి మెమోకు ఆదేశాలు

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 23: ప్రభుత్వ అధికారులు వ్యక్తులకు ఎప్పుడు భయపడకుండా చట్టాన్ని గౌరవిస్తూ పనిచేస్తేనే నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని సింగూర్, గట్‌లింగంపల్లి, నల్లవాగు ప్రాజెక్టులను మంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం నారాయణఖేడ్ మండలం జూల్‌కల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనంలో నియోజకవర్గం అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత పాలనలో ఈ ప్రాంతానికి చెందిన అధికారులంతా వ్యక్తులకు, నేతలకు భయపడి పనిచేసే సంస్కృతి ఉండేదని, తమ ప్రభుత్వంలో అలాంటి అవకాశం ఉండదని, పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకు మేలు జరిగేలా పనిచేయాలని సూచించారు. మిషన్ కాకతీయ పనులతో పాటు మిషన్ భగీరథ, మార్కెట్ యార్డుల నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు, తాగునీరు, సాగునీటి సౌకర్యాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నారాయణఖేడ్‌కు చెందిన సాగునీటి విభాగం డిఇ ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారని, అతనిని వెంటనే తొలగించాలని ఎస్‌ఇ పద్మారావును మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. మొదటి విడత మిషన్ కాకతీయలో భాగంగా కంగ్టి మండలంలో ఉన్న ఏడు చెరువుల మరమ్మతులో ఐదు చెరువుల పనులు ప్రారంభించకపోవడంపై జెఇపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే మెమో జారీ చేయాలని సూచించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా పక్షం రోజులకు ఒకసారి ఖేడ్‌కు వచ్చి కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, అధికారులంతా జాగ్రత్తగా పనిచేయాలని హెచ్చరించారు. అధికారులు ఒక్కో చెరువును దత్తత తీసుకుని పనులు పూర్తయ్యేవరకు దృష్టిని కేంద్రీకరించాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తప్పు చేసిన వారిని సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. టెండర్లు దక్కినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని చెప్పారు. గతంలో నారాయణఖేడ్ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేపట్టినా నాణ్యత ఉండదనే అపవాదును కొత్త పాలనలో తొలగించేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాలికపై సామూహిక అత్యాచారం

ముగ్గురిపై నిర్భయ, ఎస్‌సి అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు

మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 23: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో బాలికపై అత్యాచారం సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఈ నెల 12న రాత్రి మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ ప్రాంతంలో బస్సు దిగి కొండ్రపోల్ వెళ్లేందుకు వేచి ఉంది. అదే సమయంలో ముగ్గురు యువకులు మోటార్‌సైకిల్‌పై వచ్చి ఆమెను ఎక్కడికి వెళ్లాలని అడిగి బైక్‌పై ఎక్కించుకుని, కొండ్రపోల్ సమీపంలోని పార్తు తండా వద్ద తనపై అత్యాచారం జరిపారని ఆ బాలిక ఆలస్యంగా ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదికూడా ఆమెపై అత్యాచారం చేసిన వారు దుష్ప్రచారం చేసినట్లు తెలిసింది. అత్యాచారం జరిపినవారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, ఒక మేజర్ యువకుడున్నారు. ఆమెను 164 సెక్షన్ కింద స్థానిక ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు ఒన్‌టౌన్ పోలీసులు మంగళవారం నాడు కోర్టులో పిటిషన్ వేసినట్టు ఇన్‌స్పెక్టర్ డి.బిక్షపతి తెలిపారు. బాలికపై అత్యాచారం, కిడ్నాప్ చేసిన వారిలో ఇద్దరు కూడ మైనర్ కావడంతో బాల నేరస్థులు కావడం, పోలీసు ఉన్నత అధికారులు మేడారం జాతర విధుల్లో ఉండటంతో కింది అధికారులు కేసు వివరాలను తెలపలేదు. ఉన్నతాధికారులు వచ్చిన అనంతరం కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న తరుణంలో వివరాలు తెలిశాయి. ముగ్గురిపై నిర్భయ, సామూహిక అత్యాచారం, కిడ్నాప్, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసులను నమోదు చేసి మిర్యాలగూడ డిఎస్‌పి గోనె సందీప్ దర్యాప్తు జరుపుతున్నారు.