తెలంగాణ

ఆ చిన్నారుల మోములో ‘స్మైల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్’లో 5531 మంది పిల్లలకు విముక్తి కలిగింది. తప్పిపోయి, ఇంట్లోంచి పారిపోయివచ్చి, పలు పరిశ్రమల్లో బాల కార్మికులుగా చాకిరీ చేస్తున్న చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పించారు. వీరిలో కొందరిని తమతమ ఇళ్లకు, మరికొందరిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఒక ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో ఏర్పాటైన ఒక బృందం, మరో 83 బృందాలతో సిఐడి పోలీస్ పర్యవేక్షణలో పలుచోట్ల దాడులు చేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనా మందిరాలు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద, ఫుట్‌పాత్‌లపై వీరిని కనుగొన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఎన్జీవోలు, పునరావాస కేంద్రాల వారు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వీరిని పట్టుకున్నారు. మొత్తం 5531 మందిలో 4173 బాలురు కాగా 1358 మంది బాలికలు ఉన్నారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా పోలీసులు జరిపిన దాడుల్లో గాజుల తయారీ కేంద్రాలు, ఇటుక పరిశ్రమ, హోటళ్లు, టీ స్టాళ్లు, షాపింగ్ మాళ్లలో పనిచేస్తున్న 741 మంది బాల కార్మికులను పట్టుకొని 448 కేసులు నమోదు చేశారు. 57 మంది తప్పిపోయిన పిల్లలను పట్టుకొని వారిలో 46 మందిని గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 154 మంది బాలకార్మికులను పట్టుకున్నారు. వీరిలో ఒడిశా 19, బీహార్ 90, కర్నాటక 8, వెస్ట్ బెంగాల్ 18, రాజస్థాన్ 9, జార్ఖండ్ 1, మధ్యప్రదేశ్ 1, మణిపూర్ 1, మహరాష్ట్ర 1, ఉత్తరప్రదేశ్ నలుగురితో పాటు నేపాల్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు.

తెలంగాణలో రోడ్లకు
రూ. 111.20 కోట్లు మంజూరు

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2,053 రోడ్ల విస్తరణ, స్థాయి పెంపుకోసం 111.20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.