తెలంగాణ

దారుణం.. దుర్మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ముషీరాబాద్: దేశంలోని పలు యూనివర్శిటీల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు దేశ భక్తులు, దేశ ద్రోహుల మధ్య జరుగుతున్న సంఘర్షణల ఫలితమేనని ఎబివిపి ఆఖిల భారత సహ సంఘటన కార్యదర్శి జి రఘునందన్‌జీ అన్నారు. దేశంలోని ఆయా యూనివర్శిటీల్లో జరుగుతున్న సంఘటనలను నిరసిస్తూ మంగళవారం ఎబివిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞాసభకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అఫ్జల్‌గురు, యాకూబ్ మెమెన్‌కు అనుకూలంగా, జాతీయ భక్తులుగా నినాదాలు చేసిన వారికి దేశంకోసం ప్రాణాలొడ్డిన హనుమంతప్ప లాంటి జాతీయభక్తులు ఏమవుతారని ప్రశ్నించారు. భారత సైనికులు చనిపోయినప్పుడు దేశం నలుమూలలా ఉండే రైతులు, కూలీలు భారత్‌మాతాకీ జై అని నినాదాలు చేస్తూ నిజమైన దేశభక్తి చాటుకుంటున్న విషయాన్ని యూనివర్శిటీల్లో పిహెచ్‌డి చేస్తున్న దొంగ స్కాలర్స్, విలువలు లేని ప్రొఫెసర్స్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
1949లో మహారాష్ట్ర ఎన్నికల్లో అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఓడించిందనీ, అప్పుడు బ్రిటిష్ వారికి కాంగ్రెస్ ఏజెంట్‌గా మాట్లాడిందని గుర్తుచేశారు. వాజపేయి తరహాలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్లీపర్ సెల్స్‌ను అణచివేయాలని కోరారు. జెఎన్‌యులో ఈనెల 9న ఆటంకవాదులను సౌరభ్ శర్మ అడ్డుకుంటే అతన్ని బెదిరించారనీ, ఇది భారత్ అంతర్గత విషయం కాదనీ అంతర్జాతీయ విషయమని రఘునందన్‌జీ అన్నారు. చదువుకోవటానికి యూనివర్శిటీలకు వచ్చే విద్యార్ధుల్లో దేశద్రోహ భావాలు నింపటం దుర్మార్గమన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లాంటి వారిని దేశద్రోహులుగా జెఎన్‌యులో చిత్రీకరిస్తుండటం దురదృష్టకరమన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ 3ఒక దేశంలో రెండు చట్టాలు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు మనకొద్దు.. మనకొద్దు2 అన్న శ్యామాప్రసాద్ ముఖర్జీని నెహ్రూ ప్రభుత్వం విషమిచ్చి చంపిందని ఆరోపించారు. మన దేశంలో విదేశీ కుతంత్రాలు కొనసాగుతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే జెండా, ఒకే సంస్కృతిగా మనమంతా బలంగా ఉండి శక్తిమంతంగా నిలవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఎబివిపి అధ్యక్షుడు సుశీల్‌కుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి యూనివర్శిటీలో వామపక్ష సంఘాలు విషపూరిత సిద్ధాంతాలను నూరి పోస్తున్నాయని ధ్వజమెత్తారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకుంటే రాద్ధాంతం చేస్తున్నారనీ, అంతకుముందే తనపై దాడి జరిగితే ఏ విద్యార్ధి సంఘం కూడా ఖండించలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎబివిపి నాయకులు, దివంగత మేజర్ పద్మనాభ ఆచార్య తండ్రి జగన్నాథ ఆచార్య, ఫోరమ్ ఫర్ ది ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటి ప్రతినిధి గోర్థి, సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి పాల్గొన్నారు.
chitram....
మంగళవారం ఇందిరాపార్కువద్ద
ధర్నా చేస్తున్న ఏబివిపి కార్యకర్తలు

హైదరాబాద్‌లో మంగళవారం ఏబివిపి ఆధ్వర్యంలో నిర్వహించిన
ప్రతిజ్ఞాసభలో ప్రసంగిస్తున్న అగ్రనేత రఘునందన్‌జీ