రాష్ట్రీయం

బయటపడ్డ బ్రిటీష్ నాణేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, నవంబర్ 29: విశాఖ జిల్లా, చోడవరం మండలంలోని ముద్దుర్తి గ్రామ పురాతన తాటాకు ఇల్లు తొలగింపులో బ్రిటీష్ కాలం నాటి నాణేలు బయపడ్డాయి. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ రామునాయుడు ఆదివారం గ్రామానికి చేరుకుని ఆ కుటుంబ సభ్యులను విచారించి, నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దుర్తి గ్రామానికి చెందిన డొంకాడ సన్యాశిరావుకు పెద్దల ఆస్తి పంపకాల్లో తన వాటాగా పాత తాటాకు ఇల్లు వచ్చింది. ఆ ఇంటిని తొలగించి పక్కా గృహనిర్మాణం చేసేందుకు శనివారం తొలగింపు పనులు చేపట్టారు. ఈ సందర్భంలో ఆ ఇంటి మట్టి గోడల్లో తమ పూర్వీకులు కొబ్బరికాయను డొల్లచేసి, దాచిపెట్టిన బ్రిటీష్ కాలం 1904, 1906 సంవత్సరాలకు చెందిన 22 రూపాయి నాణేలు బయటపడ్డాయి. అవి వెండినాణేలుగా భావించారు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఆనోటా ఈనోటా రెవెన్యూ కార్యాలయం వరకూ చేరింది. తహశీల్దార్ గ్రామానికి చేరుకుని ఇంటి యజమాని సన్యాశిరావును గ్రామపెద్దలు నంబారు గోవింద, అప్పికొండ లింగబాబుల సమక్షంలో విచారించి నాణేలను పరిశీలించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా డొంకాడ కుటుంబానికి చెందిన పూర్వీకులు అప్పట్లో బర్మా దేశంలో వ్యాపారాలు సాగించేవారని, ఇంకా నగదు, నగలు దాచి ఉండవచ్చన్న పుకార్లు గ్రామంలో షికారు చేస్తున్నాయి.

కుటుంబ చరిత్రను
బజారుకీడ్చారు

ఆనం సోదరులపై రఘువీరా ధ్వజం

నెల్లూరుసిటీ, నవంబర్ 29: ఆనం సోదరులు 80 ఏళ్ల రాజకీయ చరిత్ర గల కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ఓనమాలు తెలియని నారా లోకేష్, మంత్రి నారాయణ కాళ్లపై పడుతుంటే స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించిన తనకు రక్తం ఉడికిపోతోందని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పరామర్శించారు. అనంతరం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ గతంలో చంద్రబాబునాయుడు లేఖ వల్ల విభజన జరిగిందని చెప్పిన ఆనం సోదరులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన లేఖను వెనక్కి తీసుకోవడం వల్ల ఆ పార్టీలోకి వెళుతున్నారేమోనని ప్రశ్నించారు. గతంలో విభజన పాపం కాంగ్రెస్ ఒక్కదానిదే కాదని, అన్ని పార్టీలు లేఖలు ఇవ్వడం వల్ల జరిగిందని చెప్పిన పెద్దమనుషులు అధికార దాహంతో పార్టీని వీడే వాళ్లు కాంగ్రెస్‌పై బురదజల్లడం తగదన్నారు. అటువంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు యువరక్తం ఉరకలు వేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని శూన్యం చేసే సత్తా ఎవరికీ లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని రక్షించేందుకు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రస్తుతం రెట్టింపు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు భారీగా జరుగుతుంటే ఒక్క నెల్లూరులోనే సరిగా జరగలేదన్నారు. రాబోయే రోజులలో నెల్లూరు జిల్లాలో 12 జిల్లాల కంటే పార్టీని పటిష్ఠం చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పిసిసి కార్యదర్శి ఉడతా వెంకట్రావు, రాష్ట్ర కాంగ్రెస్ బిసి సెల్ నాయకుడు రఘురామ్ ముదిరాజ్, మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.