తెలంగాణ

రేషన్ షాపుల్లో సిసి కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుని సబ్సిడీ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి రేషన్ షాపులో సిసి కెమెరాలు అమర్చుతారు. అదేవిధంగా రేషన్ షాపులకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేసే ఎంఎల్‌ఎస్ పాయింట్స్ వద్ద కూడా సిసి టీవి కెమెరాలు ఉంటాయి. గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్స్‌కు అటు నుంచి రేషన్ దుఖాణాలకు సబ్సిడీ బియ్యం తీసుకు వచ్చే వాహనాలకు జిపిఎస్‌ను అమర్చుతారు.
దీని వల్ల ఎటు నుంచి బియ్యం ఎటు వెళుతున్నాయో తెలుసుకుంటారు. సివిల్ సప్లై భవన్‌లో సోమవారం పౌర సరఫరాల శాఖ కమీషనర్, నగర పోలీసు కమీషనర్, పోలీసు శాఖ, పౌర సరఫరాల శాఖకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సబ్సిడీ బియ్యం అక్రమ తరలింపును పూర్తిగా నిరోధించడానికి తీసుకోవలసిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేసే బియ్యిం ను దారి మళ్లిస్తే కఠినంగా శిక్షించాలని నిర్ణయించారు. పోలీసు శాఖ, పౌర సరఫరా శాఖ సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. ఈ రెండు శాఖలు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి తమ సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవాలని నిర్ణయించారు. మొబైల్ యాప్స్ ద్వారా సమాచార మార్పడి చేసుకుంటే సబ్సిడీ బియ్యం దారి మళ్లే అవకాశం ఉండదని ఇరు శాఖల అధికారులు భావించారు.

ఖమ్మం, వరంగల్‌కు

నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. మూడు రోజులపాటు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 25న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 26న నామినేషన్ల ఉప సంహరణ. మార్చి 6న పోలింగ్, 9న ఫలితాల వెల్లడి. 15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగిస్తారు.
గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో వరంగల్, ఖమ్మం ఎన్నికలపై విపక్షాల్లో ఉత్సాహం కొరవడింది. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా మరోవైపు ఖమ్మంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు టిఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్నారు. రాజధాని నగరంలో ఘన విజయం సాధించిన టిఆర్‌ఎస్ ఇప్పుడు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఘన విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. వరంగల్‌లో 58 వార్డులు, ఖమ్మంలో 50 వార్డులు ఉన్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకముందే వరంగల్‌లో పదిమంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
వరంగల్‌లో మొత్తం 58 వార్డులు ఉంటే అన్నింటిలోనూ విజయం సాధించడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించాలని టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఇక ఖమ్మంలో పరిస్థితి వరంగల్ తరహాలో ఉండక పోయినా టిఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయం అని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో విజయం కోసం తుమ్మల నాగేశ్వరరావు చాలా రోజులనుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పార్టీ నాయకులతో సోమవారం సమావేశం అయ్యారు. ఖమ్మం పట్ణణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు తుమ్మల సమక్షంలో సోమవారం టిఆర్‌ఎస్‌లో చేరారు.