జాతీయ వార్తలు

మాకూ జాతీయ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నీటి ప్రాజెక్టులకు కేంద్రం సకాలంలో అనుమతుల ఇవ్వకపోవటం వల్లే ప్రాజెక్టుల ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. నిర్మాణంలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరగటంతోపాటు ప్రజలకు సకాలంలో నీరందటం లేదని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన హారీశ్, రాష్ట్రానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన అంశాలను కేంద్ర జలవనరుల మంత్రి ముందుంచారు. పిఎంకెఎస్‌వై పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల అమలుతీరును సమీక్షించేందుకు కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి సోమవారం విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, కార్యదర్శుల రెండు రోజుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రి హరీశ్, భేటీ కొనసాగుతున్న సమయంలోనే బయటకు వచ్చి మీడియాతో కొద్దిసేపు మచ్చటించారు. పిఎంకెఎస్‌వై కింద చేపట్టిన 23 ప్రాజెక్టులను 2017నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ తీరుతెన్నులను సమీక్షించేందుకు సోమవారం సమావేశం జరిగిందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సాయం చేయాలని సమావేశంలో సూచించామన్నారు. నీటిపారుదలు ప్రాజెక్టుల నిర్మాణం గతంలో పది, పదిహేనేళ్లలో పూర్తి చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్రాలకు కేవలం ఐదేళ్ల సమయం మాత్రమే ఉంటుందన్నారు. ఐదేళ్లలో ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధం చేసి పూర్తి చేయాల్సివుంటే, అనుమతులు ఇచ్చేందుకే కేంద్ర జల సంఘం మూడు నాలుగేళ్ల సమయం తీసుకుంటుందన్నారు. అనుమతుల మంజూరులో జాప్యంవల్ల ప్రాజెక్టు ఖర్చు, అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వంపై భారం పెరిగి ప్రజలకు సకాలంలో మంచినీరు అందించలేకపోతున్నామని హరీశ్ రావు వాపోయారు. జలాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది కనుక, రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ఒకటి కేటాయించాలని హరీశ్ రావు కోరారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినపుడు కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐబిపి కింద 46 ప్రాజెక్టులు చేపడితే తెలంగాణకు సంబంధించిన దేవాదులను మాత్రమే ఇందులో చేర్చారు కనుక, తమ రాష్ట్రానికి సంబంధించిన రెండు నీటిపారుదల ప్రాజెక్టులను కూడా ఏఐబిపి పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. పర్యావరణ అనుమతుల విషయంలో జాప్యం నివారణకు కేంద్ర పర్యావరణ శాఖతో సమన్వయం చేసేలా ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రాలకు పర్యావరణ, అటవీ అనుమతులు వెంటనే మంజూరు చేయించాలని కోరారు. విద్యా హక్కు, సమాచార హక్కు మాదిరిగా జల హక్కును రాష్ట్రాలకు కల్పించాలని డిమాండ్ చేశారు. పదిహేను రోజుల్లో అనుమతులు లభించకుంటే పారిశ్రామికవేత్తలు స్వయం ప్రకటనతో పరిశ్రమలు ప్రారంభించుకునేందుకు తెలంగాణ సిఎం కె చంద్రశేఖరావు అనుమతిచ్చినట్టే, నీటిపారుదల ప్రాజెక్టులనూ ప్రారంభించుకునేందుకు వీలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, తాను చేసిన వివిధ సూచనల పరిశీలనకు, అనుమతుల్లో జాప్యం నివారణపై కమిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఉమాభారతి అంగీకరించారని హరీశ్ రావు చెప్పారు. కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రధానిని కలిసి తగు చర్యలు తీసుకుంటామని ఉమాభారతి హామీ ఇచ్చారన్నారు.

చిత్రం... విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, కార్యదర్శుల రెండు రోజుల సమావేశంలో జ్యోతి వెలిగిస్తున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు. వేదికపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి.