రాష్ట్రీయం

అభ్యర్థులకు షాక్ ఇచ్చిన ‘క్యాట్’ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: దేశంలోని 19 ఐఐఎంలలో మేనేజిమెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నాడు నిర్వహించిన క్యాట్-2015 పరీక్ష అభ్యర్ధులను అయోమయానికి గురిచేసింది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (క్యూఎ), వెర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్(విఎఆర్‌సి), డా టా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డిఐఎల్‌ఆర్)లలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్ధులను గందరగోళంలోకి నెట్టాయి. క్యూఎలో 34 ప్రశ్నలు, డిఐఎల్‌ఆర్‌లో 32, విఎఆర్‌సిలో 34 ప్రశ్నలు వచ్చాయి. బహుళైచ్ఛిక జవాబులున్న ప్రశ్నలు విఎఆర్‌సిలో 24, డిఐఎల్‌ఆర్ 24, క్యూఎలో 19 వచ్చా యి. విస్తృత సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు విఎఆర్‌సిలో 10, డిఐఎల్‌ఆర్‌లో 8, క్యూఎలో 15 వచ్చాయి. ఆ విధంగా చూసుకుంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు 67, విస్తృత సమాధానాలున్న ప్రశ్నలు 33 వ చ్చాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు కాగా తప్పు రాస్తే మైనస్ మార్కు ఇస్తారు. ఈసారి క్యాట్ పరీక్షకు 1,49,408 మంది పురుషులు, 69,176 మంది స్ర్తిలు, 80 మంది ‘హిజ్రా’ అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్యాట్ 2015 ఫలితాలను జనవరి రెండో వారంలో ప్రకటించనున్నారు. ఈ పరీక్షలో స్కోర్ వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ అమలులో ఉంటుంది.

హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆదివారం పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు, స్వరూపానందేంద్రస్వామి