రాష్ట్రీయం

ఎవ్వరూ అధైర్యపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ వెంకటగిరి/ కడప, నవంబర్ 20: భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులు అధైర్యపడాల్సిన పని లేదని, అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. శుక్రవారం కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. పండ్లతోటలకు ఎకరాకు పదివేలు, దెబ్బతిన్న చేనేత మగ్గాలకు తక్షణం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను యుద్ధప్రాతిపదికను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీని శుక్రవారం రాత్రి మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్లుగా కరవుకాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ప్రజలను ఇబ్బందులు గురిచేశాయన్నారు. దీంతో నెల్లూరు-చైన్నై మార్గమధ్యంలోని జాతీయ రహదారి కూడా తెగిపోయిందన్నారు. జిల్లాలో పలు ప్రాంతాలు జలదిగ్భందం కావడంతో మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావును పంపించి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. తుఫాన్ కారణంగా నిరాశ్రయులైన వారికి రోజుకు మూడుపూటలా భోజనాలు ఏర్పాటు చేయాలని, దీనికి ఎన్ని క్యాంపులైన ఏర్పాటు చేయాలని, అవసరమైతే హోటల్స్‌లో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, చైర్మన్ శారద మరింత కృషి చేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారన్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో గతంలో హూదూద్ , ఇప్పడు రేవాన్ తుఫాన్ నానా ఇబ్బందులు పెట్టాయన్నారు. అయినా ప్రజలు ఎలాంటి అవస్థలు పడకుండా ఉండాలని తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి 25 కేజీల బియ్యం, కేజీ చక్కెర , కేజీ కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్ తక్షణమే పంపిణి చేయిస్తున్నట్టు చెప్పారు. బాధితులు అధైర్య పడాల్సిన అవసరంలేదన్నారు. రేషన్ డీలర్ల సరుకులు ఇవ్వకపోతే దబాయించి తీసుకోవాలన్నారు. ఇల్లు పూర్తిగా కూలిపోతే 50వేలు, పాక్షికంగా దెబ్బతింటే 25 వేలు, పూరి గుడిసెకు 6.5 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని ఆదేశించామన్నారు. చేనేతల మగ్గం గుంటల్లో నీళ్లుచేరిన వారికి 10 వేలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. చేనేతలకు రుణమాఫీ , సొసైటీ రుణాల మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్టీఆర్ కాలనీని పరిశీలించామని, రోడ్లు, డైనేజి కాల్వల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, రాఘవరావు, ఎంఎల్‌సి వాకాటి నారాణరెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణయాచేంద్ర, కలెక్టర్ జానకి తదితరులు ఉన్నారు.
మళ్లీ మళ్లీ వస్తా
గూడూరు/చిల్లకూరు: తుపాను బాధితులను ఆదుకునేందుకు మళ్లీ మళ్లీ వస్తానని సిఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. శుక్రవారం రాత్రి రోడ్డుమార్గాన గూడూరుకు రాత్రి 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. గూడూరుకు చేరుకుంటున్న సిఎం కాన్వాయ్‌ను అంబేద్కర్‌నగర్, శాంతినగర్‌లో ప్రజలు అడ్డుకోవడంతో సిఎం కారు దిగి ప్రజల ముందుకొచ్చి సమయాభావం వలన అన్ని ప్రాంతాల ప్రజలను నేరుగా కలుసుకోలేకపోతున్నానని, మరో పర్యాయం వచ్చి అందరినీ కలుసుకొని అన్నివిధాలా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జాతీయ రహదారి నుంచి చిల్లకూరు మండలంలోని పారిచెర్ల వారిపాలెంకు వెళ్లారు. అక్కడ ప్రజలు ఒక్కసారి సిఎంను చుట్టుముట్టి పదిరోజులుగా నీళ్ల మధ్యలో ఉండి అవస్థలు పడుతున్నామని, అధికారులు దరిచేరలేదని, సాయం అందించలేదని వాపోడంతో సిఎం స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహశీల్దార్, విఆర్‌ఓలను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
కడప జిల్లాలోనూ వర్షాలకు నష్టపోయిన రైతులను సిఎం చంద్రబాబు శుక్రవారం పరామర్శించారు. దెబ్బతిన్న పండ్లతోటలను పరిశీలించారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఏడాదిలోగా రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో 15వేల కిలోమీటర్లమేర సిమెంట్ రోడ్లు నిర్మిస్తామన్నారు. అలాగే గాలేరు-నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేసి కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పండ్లతోటల రైతుకు ఎకరాకు రూ.10వేలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, వాగులకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముష్తేరు వాగు, గుంజా నదిని సిఎం పరిశీలించారు. వర్షానికి మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి, వివిధ పంటల రైతులతో మాట్లాడి నష్టాలను ఆరాతీశారు. హెలికాఫ్టర్‌లో మధ్యాహ్నం 1.35 గంటలకు రైల్వేకోడూరులో దిగిన సిఎం రోడ్డుమార్గం ద్వారా పర్యటించి, అనంతరం 3.35కు నెల్లూరుకు వెళ్లారు. సిఎం వెంట ఆయన కలెక్టర్ కెవి రమణ, ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

చిత్రం.. కడప జిల్లా రైల్వేకోడూరులో వరదబాధితులను పరామర్శిస్తున్న సిఎం చంద్రబాబు