శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ద్రవ్యమే పరమార్థము ద్రవ్యలబ్ధి
కెంత దిగజారుటకునైన వింతఁ గొల్పు
నటుల సిద్ధమై పోదురే! నటనఁ జూపి
జూడమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: ధనార్జనే జీవిత పరమార్థమని భావిస్తూ అట్టి, ధనసముపార్జన కోసం ఎంతటి నీచమైన దుస్థితి కైనా ధనంకోసం జీవితంలో అద్భుతంగా నటిస్తూ మానవతావిలువలను , వెలకట్టలేని నైతిక విలువలను చుట్టచుట్టి విసిరి పారేస్తున్నారే ఈ జనం. వీరు ఈ ధనం శాశ్వతం కాదని ఎపుడు తెలుసు కొంటారో ఓ కర్మసాక్షి ! ఓ సూర్యదేవ! నీవైనా చూడవయ్య.
తే.గీ. ఏల క్రోధంబు?విద్రోహమేల? జనుల
కేల యావేశమేలకో?కీడు నెంచఁ
దోచురీ మూడు నాడుల ముచ్చటైన
జీవితంబున విడువరచ్చెరువు గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఆలోచిస్తే ఈ మూన్నాళ్ల ముచ్చటైన జీవిత గమనంలో శాశ్వత విలువలను ఆపాదించుకోవాలి తప్ప కోపావేశాలు, విద్రోహచర్యలు వంటివి దేనికి? కీడు చేయాలన్న ఆలోచనే తప్ప ఎక్కువ శాతం జనులు మేలు చేయాలనుకోరెందుకనో! కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఇందంతా కలి మాయా ప్రభావం ఏమో చూడవయ్య సూర్యదేవ! కర్మసాక్షివి నీవేకదా.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262