శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అప్పగింతురు పిల్లల నాయలకును
గాస్త పెరిగిన హాస్టళ్ల కప్పగింత్రు
ఎటుల ఁ బుట్టును ప్రేమల వెంతగానొ?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ రోజుల్లో పసిపిల్లలను ఆయమ్మల చేతిలో పెట్టేస్తున్నారు. కాస్త పెరిగి పెద్దవారు కాగానే హాస్టళ్లల్లో పడేస్తున్నారు. పిన్నలకును, పెద్దలకును మధ్య ప్రేమలు పుట్టుకు రావాలంటే ఎలా పుట్టుకొస్తాయి? వారి మధ్య అనురాగానికి కాస్తంతా చోటు కాని సమయం కాని లేకుండా కట్టదిట్టం చేసేస్తూ తిరిగివారే అనురాగం లేదు బంధాలకు విలువలు లేకుండా పోతున్నాయ అనే వీరిని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య.
తే.గీ. మాయమర్మములెఱుగుని మచ్చలేని
మనుజులెచ్చోటఁ గనరారె మహిన ఁ గాంచ
బహువిదమ్ముల మోసాలు పడగలెత్తె ఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మచ్చలేని, మాయమర్మాలెరుగని మనుషులు ఈరోజుల్లో భూమండలమంతా వెతికినా కనబడరు. అనేక రకాలుగా మోసాలు పడగలెత్తుతున్నాయి. తల్లిదండ్రులతో పిల్లలు, భార్యాభర్తల్లో ఒకరికొకరు గా ఉండాలనుకొనే వారిలోనే ఒకరిపై మరొకరు ఎత్తులు వేస్తూ మోసాలు చేసుకొనే వారు ముగ్గురిని పరిశీలిస్తే అందులో ఇద్దరు మోసగాళ్లుగా కనబడుతున్నారు. వీరిని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262