శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కాసుకంటికిఁ గన్పట్టఁ గన్నుఁ జెదరి
విలువలన్నియు ఁ బ్రక్కకుఁ బెట్టి దాని
నందుకొనుకటకు ఁజేతురే యత్నములనుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ రోజుల్లో డబ్బు కనబడగానే దానినెలాగైనా పొందాలనే కాంక్షతో నైతిక విలువలన్నీ ప్రక్కకు పెట్టేసి , ఎలాగైనా సరే బాగా సంపాదించాలనే ప్రయత్నాలను చేస్తున్నారు. డబ్బు కోసం తల్లదండ్రులను, తోబుట్టువులను కూడా కడతేర్చడానికి వెనుకాడడం లేదు. వారిలో కాస్తంతైనా మార్పు కలిగించవయ్య కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! వీరిని ఓ సారి చూడవయ్య.
తే.గీ. అందచందాలు గఱిగిపోరాదటంచు
బోతపాలనుఁ ద్రావింతురెంత ఘోర
మమ్మతనమునకే మచ్చసుమ్మి యకట!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: తన అందచందాలు కరిగిపోకుండా శాశ్వతంగా కాపాడుకోవాలనే వట్టిభ్రమతో పసిపిల్లలకు పోతపాలనే త్రాగిస్తున్నారు. ఇది ఎంత ఘోరం? అయ్యో అమ్మతనానికే ఇదిమాయని మచ్చ సుమా. అమ్మఅన్న పదానికి ఉన్న పవిత్రభావనకు కళంకాన్ని కల్మషాన్ని కలిగించే అమ్మల హృదయంలో మార్పును తీసుకొని రావయ్య ఓ కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! వీరిని ఓ సారి చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262