శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కీడు సేయంగ వెనుకాడఁ బోడు గాంచ
మేలు సేయని వాడెపో మేటి గాంచ
గేలిసేయంగ ముందునకేగుఁ గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నేటికాలంలో కీడు తలపెట్టడానికెవ్వడూ వెనుకాడడు. పరులకు ఏమాత్రం మేలు చేయని వాడే మేటివానిగా గుర్తింపబడుతున్నాడు. ఇతరులను గేలిచేసే విషయమై ముందుకొస్తున్నారు. సొంతలాభం కొంతమానుకొని పొరుగువానికి తోడుపడవోయ్ అన్న పెద్దల మాట పెడచెవిన పెట్టే వీరిని ఏం చేయాలో? కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య.
తే.గీ. మద్యమందునఁ బడిపోయి మనుజ నీతి
నియమముల ఁదప్పి సంఘాన నిల్వలేకఁ
జావుకొని ఁ దెచ్చుకుందురా శ్రయము లేకఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మద్యం మత్తులో పడి మనిషికి ఉండాల్సిన నీతినియమాలను తప్పిసమాజంలో తలెత్తుకుని నిలబడలేక ఆశ్రయాన్ని కోల్పోయి చావును కొనితెచ్చుకుంటున్నారు. బాధలను ఆపదలను ఎలా ఎదుర్కోవాలో తెలియక పలాయనవాదం లో ఉన్న వీరంతా మద్యానికి బానిసలు అవుతున్నారు. వీరు అసలు విషయం తెలుసుకొనేదెప్పుడో? కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262