శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కష్టపడకుండ పలితమ్ము గాంచఁ దలచి
వక్రమార్గాలఁ ద్రొక్కెడి వారితోడఁ
బృథ్వి బీటలు వెక్కసముగఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: ఏ మాత్రం కష్టపడకుండా ఫలితాలను పొందాలని భావించి వక్రమార్గాలలో నడిచే దుర్మార్గులతో ఈ భూమండలం ఎంతగానో బీటలు వారిపోయింది. కలిమాయ ప్రభావంతో సన్మార్గంలో నడిచేవారికి నడవాల నుకొనేవారికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయ. వారికి ఎన్నో కష్టాలు వాటిని అధిగమించడానికి ఎన్నో కడగండ్లు ఎదురవుతాయ. కానీ అధర్మంలో నడిచేవారికి అన్నీ సుగమమైన మార్గాలు కనిపిస్తున్నట్టు ఉంది. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య.
తే.గీ. మాటలెన్ని యో కోటలు దాటుచుండెఁ
జేయవలసిన కృత్యాలు సేయరాయె
వారె ఘనులుగ లెక్కింపఁ బడుదురవనిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మాటలు కోటలు దాటిపోతున్నాయి. చేయవలసిన పనులు చేయకున్నారు. అరచేతిలోనే వైకుంఠాన్ని చూపిస్తుంటారు. కాని అన్నీ గాలిమేడలే ఉంటాయ. అటువంటివారే ఈ భూమియందుగొప్పవారిగా లెక్కింపబడుతున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ ! చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262