శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. బ్రహ్మచర్యంపు దీక్షలు భంగపడియె
హా! గృహస్థాశ్రమపు ధర్మమంతమొందె
వానప్రస్థాశ్రమంబది కాన కేగె
కడపటాశ్రమ ధర్మంబు కానరాదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: విద్యార్థులు బ్రహ్మచర్యాశ్రమ ధర్మాన్నిన విస్మరిస్తున్నారు. గృహస్థాశ్రమ ధర్మాన్ని గృహస్థులు పట్టించుకోవడం లేదు. వానప్రస్థాశ్రమ ధర్మాన్ని అడవులకు పంపేశారు. సన్యాసాశ్రమధర్మాన్ని పాటించాల్సిన వయస్సులోనూ భవబంధాలను తెంచుకోలేక పోతున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య.
తే.గీ. వాస్తవమ్ములనో పరవాస్తములఁ
జెవిన యూదిన నమ్ముదురగవగుణాఢ్యు
లైన వారికి ఁబట్టమ్ము లధిక తమము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నిప్పులాంటి నిజాలను ఒప్పుకోరు సరికదా. అసత్యాలను చెవిలో చెబితే చాలు నమ్మేస్తున్నారెందరో. అవగుణాలు కలిగిన వారికేఅధికంగా పట్టాలు కడుతున్నారు. ఇదంతా కలియుగ మహిమ అనుకొంటాను. అబద్ధాలకు, అధర్మానికి ఎక్కువ ఆకర్షితులవుతున్న మనుజులను సన్మార్గంలోకి వచ్చేట్టు చేయుము ఓ సూర్యదేవా వీరి సంగతిని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! నీవే చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262