శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నందుని సుందరీ నయన నర్తన మూర్తికి చారుకీర్తికిన్
ఇందుని సోదరరీలలిత సృత్కమలాంతర నిత్యవర్తికిన్
చందన గంధ బంధురిత సాంద్రదయారస పూర్ణ మూర్తికిన్
వందన మాచరించెద శుభంబులనందగ నందమందగన్

భావం: నందుని సుందరి అనగా యశోదమ్మ కన్నులలో నిత్యమూ నాట్యమాడెడు వాడు, లక్ష్మీదేవి హృదయంలో నిత్యమూ వసించే వాడు, చందనము వలె దయతో కూడిన చల్లని హృదయం కలవాడు ఐన నంద గోపాలునికి వందనం.

ఆ.వె. భక్తి రహితమైన పాండిత్యమును తూచ
ఇలను సాధనములు కలుగ వచ్చు
వేణు ధరుని మీది ప్రేమను తూచగా
త్రాసుల రయగలమె ధరణిలోన

భావం: లోకంలో భక్తి రహితమైన శుద్ద శబ్దపాండిత్యాన్ని తుంచడానికి రాళ్లు అంచనా వేయగలిగే మొనగాళ్లు ఉంటే ఉండవచ్చు కానీ మురళీ మోహనుడైన శ్రీకృష్ణుని మీది ప్రేమ ఇంత అని చెప్పడానికి తూనికలు, కొలతలు ఉంటాయా? (శ్రీధర స్వామి)

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949