శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్యశతకం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బు చుట్టూతఁ దిరిగెడి జబ్బుపట్టి
తుదకు మంచానఁబడినను వెదకఁబోరు
దైవమును దారి తప్పిన ధరణి జనులు
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: సన్మార్గాన్ని తప్పిన భూజనులు డబ్బు చుట్టూ తిరగడమనే జబ్బుపట్టి చివరకు మంచాన పడినా డబ్బునే తప్ప దైవాన్ని తలుచుకోవడం లేదు. ఈ రీతిని నడిచే మనుష్యులను ఒక కంట కనిపెట్టవయ్య అనే భావనతో కవి ఇలా అంటున్నారు. ఓ కర్మసాక్షివైన ఓ సూర్యదేవా చూడవయ్య.
న్యాయమన్నది గంగలో ఁద్రోయబడెను
ధర్మమన్నది యగ్నిలో దగ్ధమాయె
నీతినియమాలు గోతిలోఁ బాతఁబడెను
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: న్యాయం గంగలో త్రోయబడింది. ధర్మం అగ్నిలో పడి పూర్తిగా కాలిపోయింది. నీతి నియమాలు గోతిలో పాతబడ్డాయి. అంటే నేటి మనుషులు నీతి, న్యాయం, ధర్మం అనే వాటిని పక్కన పెట్టేసి వారి వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. ఈరీతిని మెలిగితే వారి గతేంకాను అని వ్యధచెంది కవి సూర్యునికి తన మనోవేదనను వెలిబుచ్చుతున్నాడిలా ఓ కర్మసాక్షి, ఓ సూర్యదేవ చూడవయ్య

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262