శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టబట్టియు హరిని చేపట్టినట్టి
ముద్దు పట్టి రక్మిణిన్ పొగడిరంత
సుప్రసన్నముగ సుభద్రచూచె హరిని
భీష్మకుని భాగ్యమున్ గని వే విధముల
ప్రస్తుతించిరి కుండిన పౌరులెల్ల
విదిత రుక్మిణీ కల్యాణ వేళ లోన
భావం; బ్రహ్మవైవర్తన పురాణంలో భీష్మకుడు, సుభద్ర ఇద్దరూ శ్రీకృష్ణుని పిలిచి తమ కూతురినిచ్చి అంగరంగవైభోవంగా పెండ్లి చేశారట. కాళ్లు కడిగి కన్యాదానం చేసినట్లు ఉంది. వైభవంగా జరిగిన ఆ పెండ్లి తంతును చూసి అక్కడికి వచ్చినవారంతా భీష్మకుని పొగిడారట. దాన్ని చూసిన రుక్మిణి తల్లియైన సుభద్ర ఆహా నేను ఎంతటి పుణ్యం చేసుకొన్నానో నాకు శ్రీహరి అంతటివాడే నాకు అల్లుడయ్యాడని మురిసిపోయిందట.
మీదుపదము కలనేని మెరసినంత
మురసిముద్దగు హృదులెల్ల ముదముతో
అట్టి మీదివ్య పాదమ్ము లరయ నేడు
నాదు భవనంబు నందున నడచుచుండ
పావనంబయ్యె నా యిల్లు భవ్యులారా!
భావం: భీష్మకుడు రుక్మిణీకృష్ణుల వివాహమహోత్సావానికి వచ్చిన బ్రహ్మాదిదేవతలను ఉద్దేశించి ‘ మహాత్ములారా! మీ పాదపద్మాలను కలలో క్షణకాలం దర్శనిమిస్తేనే బ్రహ్మానందం పొందుతాం. అలాంటి దివ్యములైన మీ పాదపద్మాలు నేడు నా యింట నడిచినందువల్ల నా జన్మధన్యమైంది.నా భాగ్యమేమని చెప్పను’అన్నాడట.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949