శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. రమ్య చంద్రికా రోచిస్సులలరు వేళ
ఫుల్లమల్లికా స్తబకముల్ వెల్లివిరియ
పికరవమ్ములు వీనుల విందు సేయ
మధుర మురళీరవంబులు మలయుచుండ
ప్రధిత బృందావనాంతర ప్రమద సదన
మందు సుందర గోపికా బృంద మెల్ల
ఘనత రానంద జలధిలో మునిగి తేలె
భావం: అందమైన బృందావనంలో చల్లని వెనె్నల కాస్తోంది. మల్లెలు వికసించి పరిమళం ఎల్లెడలా వ్యాపించింది. కోకిలలు మత్తుగా గమ్మత్తుగా కూస్తున్నాయి. మురళీ నినాదం మధురంగా వినిపిస్తోంది. అంత బృందావనంలోని ప్రమదముఅనేసదనంలో గోపికల బృందం వేణుధరుని సన్నిధిలో అంతులేని ఆనంద జలధిలో మునిగి తేలిందట.
తే.గీ. నిన్ను కనులారా జూడంగ నీరజాక్ష
ధనము కొరకు, ఘనతర వాహనము కొరకు
పడెడు తపనలో కొంతైన పడిన యంత
జన్మధన్యవౌను బ్రతుకు సఫలమగును
భావం: ఓ కృష్ణా! ఆస్తులు అంతస్తులు సంపాదించినా , ధన కనక వస్తు వాహనాదులు సమకూర్చుకోవడానికి పడే తపనలో కొంతైన నిన్ను చూడడానికి పడినట్లయితే మా జన్మలు ధన్యవౌతాయి. మా బ్రతుకులు ఫలవంతమవుతాయి. (శ్రీ భావానంద)

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949