శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణుని మాయ
వెన్న తినుచును దొరకని వేణుధరుని
వనితలు తలకొక్క హరిని పట్టి తీగ
ఆ యశోదమ్మ ఒడిలోన ఆడుకొనుచు
చిన్ని నవ్వు రువ్వెడు శౌరి సేమమొసగు
భావం: వెన్న తింటున్న కృష్ణుని గోపికలంతాకష్టపడి తమ తమ ఇండ్లల్లో ఒక్కో కృష్ణుని పట్టుకుని యశోదమ్మ దగ్గరకువచ్చారు. అక్కడా యశోదమ్మ ఒడిలో చిరునవ్వు నవ్వుకుంటూ ఆడుకుంటున్న కృష్ణుడిని చూసి వారంతా ఆశ్చర్యపోయారట. కానీ వారంతా అందరి చేతుల్లోను, యశోదమ్మ ఒడిలోను కనిపించే కృష్ణుడు ఆదిమధ్యాంత రహితుడైన పరంధాముడని వారు గ్రహించలేదు. చిరునవ్వు నవ్వుతున్న ఆ బాలకృష్ణుడు మనలను అనుగ్రహించుగాక!
అంతటా నేనే
కనగ జగతిలోని కణము కణమునందు
జనుల బుదిధయంధు మనమునందు
నిండియుంటి ననెడు నిజమునుగ్రహియంప
ఇక వియోగ బాధఎటుల గలుగు
భావం: పంచభూతాలలో బుద్ధిలో మనస్సులో అణువణువనా నేనే నిండి యున్నాను అనే సత్యాన్ని గ్రహించండి.అపుడు మేము రేపల్లెలో, మాధవుడు మధురలో ఉన్నాడనే వియోగ బాధ విరహవేదన మీకు ఇక కలుగవు. అనే సందేశాన్ని వేణుమాధవుడు ఉద్ధవుని ద్వారా గోపికలకు పంపించాడు.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949