శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురువు కు గురువు
కనగ అరువది నాలుగు దినములందె
వేద వేదాంగముల నేర్పి విశ్వమందు
అరయ నా జగద్గురువుకు గురువని యెడు
ఖ్యాతి గొన్న సాందీపని కంజలింతు
భావం: కృష్ణం వందే జగద్గురుం కదా. ఆ జగద్గురువుకు చిన్ననాడు కాశ్యప గోత్రోద్భవుడైన సాందీప మహర్షి గురువుగా ఉన్నాడు. 64 రోజుల్లోనే వేదవేదాంగాలను కృష్ణునికి బోధించాడు. ఇతనెంత గొప్పవాడో కదా. జగద్గురువుకే గురువుఅయిన సాందీపుల వారికి నమస్కరిస్తాను.
వేద వేద్యుడైన వేణు గోపాలుండు
వేదములును, సకల విద్యలున్ను
కొలది దినములందె అలవోకగా నేర్వ
వింత ఏమియగును పృథ్వి యందు
భావం: వ్యాసుడు రచించిన భాగవతం ప్రకారం బలరామకృష్ణులకు ఉపనయనం జరిపించి సాందీపని మహర్షివద్ద విద్యాభ్యాసానికి చేర్పించారు. అపుడు 64రోజుల్లో 64 కళలనూ నేర్చుకున్నారని భాగవతం చెబుతుంది. హరివంశం వేదవేదాంగాలను కూడా 64 రోజుల్లోనే నేర్చుకున్నారని చెబుతుంది.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949