Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మమంటి లేమొగ్గలు ఏతెంచిన వేమొ యనగ
ఆ కరచరణమ్ములూగె తామర మొగ్గల పోలిక.

పద్మముపై తామరాకు గొడుగుపట్టెనన్నట్టుల
ఒక ఛత్రం నీడ వటుడు నడచి వచ్చినట్టుల.

బ్రహ్మకడను కమండలం- విష్ణువుకడ జపమాలను
శివుని కడను భిక్షపాత్ర- అడిగి తెచ్చె ననగను.

అంచనడకలను దేలుచు- గరుడుని వలె పరికించుచు
నడచి వచ్చె వటుడచటకు- వృషభమట్లు తలనెత్తుచు.

పూరేకుల విప్పుకొనుచు బ్రహ్మయె ఉదయించెనేమొ?
పాలకడలి నుండి లేచి-విష్ణువె అడుగిడె నేమొ?

లింగమ్మును ఛేదించుచు- శివుడె బయల్పడె నేమొ?
మమ్మూర్తుల ముమ్మూర్తుల- పోలికతో నొప్పెను.

ఒక బ్రహ్మీతేజం వలె- ఒక వైష్ణవ మాయవోలె
ఒక కాంతుల వెల్లువ వలె అగుపించెను వటుడు.

యజ్ఞ పురుషుడే యనంగ వచ్చెను యజ్ఞం కడకు
వరమిచ్చెడు వేల్పనంగ యజ్ఞనేది కడకు.

ఎదురేగుచు బలియాతని తోడ్పొనుచును తెచ్చెను
ఒక శశియే ఒక భానుని కేలందుకు వచ్చెననగ.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087