శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి( శ్రీ సార్వభౌమ భట్టాచార్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. న్యాయశాస్త్రంపులోతుల నరసినాను
తర్కశాస్త్రంబు దుముట్ట తరచినాను
విరివిగా శాస్తమ్రముల్ చదివితినిగాని
నీదు మురళీ రంవబున నిండియున్న
కమ్మదనమును వానిలో గాంచనైతి

భావం: న్యాయ శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేశాను. తర్క శాస్త్రాన్ని తుదముట్టా చదివాను. శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. కానీ కృష్ణా నీ మురళీ రవంలో నిండి ఉన్న కమ్మదనం వానిలో లేదు.
తే.గీ. ఇప్పుడే గద కన్నయ్య ఇంతసేపు
సున్ని పిండి తోడను రుద్ది శుభ్రముగను
స్నానమున్ ఇంట చేయించి నానుగాదె!
అప్పుడే ఒంటిపై దూలియంటెనమి?
అందరను గూడి మట్టిలో ఆడినావ?
అన్ని యశోదమ్మ ప్రశ్నింప అమలమైన
నవ్వులను జిమ్ము కృష్ణుండు నాకు దిక్కు!
భావం: కన్నయ్యా! ఇప్పుడే కదా! సున్నిపిండితో రుద్ది రుద్ది శుభ్రంగా స్నానం చేయించాను. చందనం పూసాను. ఇంతలోనే ఒంటినండా ఆ దుమ్మేమిటి? గోపబాలకులందరితో చేరి మట్టితో ఆడుకున్నావా? అని ప్రశ్నించిన యశోదమ్మను చూచి చిరునవ్వుచిందించే గోపాల బాలుడే నాకు దిక్కు.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949