శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. రమ్య చంద్రికారోచిస్సులలరువేళ
ఫుల్లమల్లికా స్తబకముల్ వెల్లివిరియ
పికరవమ్ములు వీనుల విందుసేయు
మధుర మురళీరవంబులు మలయుచుండ
ప్రథిత బృందావనాంతర ప్రమదసదన
మందు సుందర గోపికా బృందమెల్ల
ఘనత రానంద జలధిలోమునిగి తేలె॥
భావం: అందమైన బృందావనంలో చల్లని వెనె్నల కాస్తోంది. మల్లెల పరిమళం వ్యాపించింది. కోకిల కలరావాలు మంద్రంగా వినిపిస్తున్నాయి. మురళీరవం మనసును దోస్తోంది. బృందావనం అనే ప్రమదము అనే సదనంలో గోపికల బృందం వేణుధరుని సన్నిధిలో అంతులేని ఆనంద జలదిలో మునిగి తేలిందట.
తే.గీ. గోవులన్ గాయక వెడలు గోపబాలు
గాంచి, సింహంబులెదురైన కాలమందు
భయవిదూరుడు నిజభక్త వరదుడైన
అబ్జ నాభుని స్మరియింపు మన్నయట్టి
ఆ యశోదమ్మ మాటల కాత్మ నలరి
మరలి ముసి ముసి నవ్వులన్ మురియు నట్టి
దేవకీ గర్భ జనితుండు దిక్కునాకు॥
భావం: చిన్ని కృష్ణుడు గోవులను కాయడానికి బయలుదేరుతూ ఉన్నాడు. యశోదమ్మ ‘నాయనా! నీకు దారిలో పులులు, సింహాల వంటి క్రూర మృగాలు ఎదురై భయం వేసినట్లయితే శ్రీమన్నారాయణను స్మరించు.. వెంటనే భయం తొలిగిపోతుంది.’ అని చెప్పింది. తానే నారాయణ్ణునని తెలియలేని ఆమె అమాయకత్వానికి ముసి ముసిగా నవ్వుకున్న గోపాలబాలుడు మనకందరికీ శుభముల నొసగుగాక

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949