శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వెన్నదుత్తను జూచియు వేగ జేర
కడగి మెల్లగా పాకుచు వెడలుచుండ
ఇంత లోపలను యశోద ఎదురుపడగ
ఏమియు నెరుగ కున్నట్లు మోము ద్రిప్పి
చల్లగా జారుకొన జూచు నల్లనయ్య
చల్లగా జూచి మలను సాకు గాక!
భావం: కన్నయ్యకు వెన్నదుత్త కనిపించింది. వేగగా శబ్దం రాకుండా నేలపై పాకుతూ వెళుతున్నాడు. ఇంతలో యశోదమ్మ ఎదురుపడింది. ఏమీ ఎరుగని వాడిలాగా చల్లగా వెనుదిరిగి జారుకోబోయాడు. అలా యశోదమ్మకు దొరికి పోయిన నల్లనయ్య మనలను రక్షించుగాక!
తే.గీ. వెన్న హరియింప నేగిన వేళలోన
స్తంభము నతన రూపమున్ తరచిజూచి
అన్యుడెవ్వడో తనవైన మనసెననియు
పలువిధమ్ముల బింబమున్ బ్రతిమలాడు
ముద్దు కృష్ణుండు మనలకు ముదము గూర్చు
భావం: చిన్ని కృష్ణుడు వెన్న దొంగతనం చేద్దామి వెళ్లాడు. అక్కడ మణిస్తంభంలో తన ప్రతిమను చూచి వేరెవరో తన్ను గమనిస్తూన్నారనుకొని తన ప్రతిబింబాన్ని బ్రతిమిలాడుతున్న ముగ్ధ మోహనాకారుడైన బాలకృష్ణుడు మనకు ఎల్లపుడూ ఆనందమును కలిగించుకాక!

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949