శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. నిఖిల జగతిన లేడులే నిన్ను మించు
వాడు కనుగొనవేలకో భరతవీర
ఘోరములు సహియింపకీ కువలయానఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఓ భరతవీరుడా! ఈ చరాచర జగత్తులో నిన్ను మించిన వాడు లేడని తెలుసుకోవెందుకని నీ చుట్టుతా ఉన్న సమాజానికి నీవే రక్షణ కావాలి. ప్రతి వారికి నీవే ఆదర్శమూర్తివై వెలగాలి. అన్యాయాలకు అక్రమార్కులకు నీపేరే గుండెల్లో గుబులు పుట్టించాలి. ఎటువంటి ఘోరాలను సహించని వాడవై చైతన్యతో కదలాలి. కర్మసాక్షి వైన ఓ సూర్యదేవా! ఎంతో గొప్ప స్ఫూర్తినిస్తూ చైతన్యాన్ని ప్రసాదించు స్వామీ!
తే.గీ. దేశదైవాల భక్తితోఁ దేజమొప్ప
సమ సమాజోద్ధరణ కీవు సత్వమ్ము
కదలి దేశమాతౄణము గాస్త దీర్చు
గొనగ వలె నుదాసీనత కూడదెపుడు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఓ భరతవీరుడ ఆ! అత్యద్భుతమైన తేజస్సుతో దేశమందు దైవమందు భక్తి ప్రపత్తులను కలిగియుంటూ సమ సమాజోద్ధరణను వెంటనే పూనుకుని దేశమాత ఋణాన్ని కాస్త తీర్చుకోవాలి. దేశమాత ఋణం తీర్చుకోవడానికి ప్రతివారుకంకణ బద్ధులు కావాలని, కర్మసాక్షి వైన ఓ సూర్యదేవా ! ఉదాసీన వైఖరి తగదని సూచించుము లోక ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262